సమంతాపై మరోసారి ఫేక్ న్యూస్ లు..?

టాలీవుడ్ లో ఉన్నటువంటి మోస్ట్ డేడికేటివ్ హీరోయిన్ లు చాలా తక్కువ మందే ఉండగా అలాంటి వారిలో పాన్ ఇండియా అపీల్ తెచ్చుకున్న హీరోయిన్ సమంత కూడా ఒకామె. మరి సమంత అయితే ఇప్పుడు హీరోయిన్ గా కన్నా మెయిన్ లీడ్ నటిగా ఈమె నటిస్తుంది.

అలా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో అయితే రీసెంట్ గా “యశోద” అనే సినిమాతో వచ్చి ఆమె అదరగొట్టింది. మరి ఈ సినిమా ఇప్పుడు 35 కోట్ల దిశగా వెళ్తుండగా గత కొన్నాళ్ల నుంచి సమంతపై అయితే పలు వార్తలు మాత్రం ఆగట్లేదు. నెగిటివ్ అయినా అలాగే పలు ఆరోగ్య వార్తలు అయినా కూడా వైరల్ అవుతున్నాయి.

ఇక రీసెంట్ గానే సమంత తన ఆరోగ్యం బాగోలేదని పోస్ట్ చేయగా అది పెద్ద సంచలనం గా మారింది. అయితే లేటెస్ట్ గా మళ్ళీ సమంత ఆరోగ్యంపై కొన్ని రూమర్స్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. అయితే వీటిపై మాత్రం సినీ వర్గాల నుంచి సమాచారం తెలుస్తుంది.

సమంత హాస్పిటల్ లో జాయిన్ అయ్యిందని వచ్చిన వార్తల్లో నిజం లేదు ఇప్పుడు ఆమె ఆరోగ్యం బాగానే ఉందని అంటున్నారు. దీనితో అయితే సమంత పై ఈ ఫేక్ న్యూస్ లలో ఎలాంటి నిజం లేదని చెప్పొచ్చు.