అక్కడ కూడా అదే దరిద్రమా?.. హగ్గులతో మోనాల్ రచ్చ!!

Monal Yash Romance In Dance Plus

బుల్లితెరపై షో ఏదైనా సరే.. అక్కడ గ్లామర్, లవ్ ట్రాకులు, పులిహోర బ్యాచ్‌లు కచ్చితంగా ఉండాల్సిందేనట్టుగా నియమం వచ్చింది. అందుకే అది బిగ్ బాస్ అయినా జబర్దస్త్ అయినా సరిగమప వంటి పాటల షో అయినా సరే గ్లామర్, సీక్రెట్ లవ్ ట్రాకులు, కుళ్లు కామెడీలు, డబుల్ మీనింగ్ డైలాగ్స్‌లను పెట్టేస్తున్నారు. బిగ్ బాస్ తరువాత స్టార్ మాలో డ్యాన్స్ ప్లస్ అనే షో ప్రారంభమైన సంగతి తెలిసిందే.

Monal Yash Romance In Dance Plus

ఓంకార్ హోస్ట్‌గా ప్రారంభమైన ఈ షోలో ముమైత్ ఖాన్, మోనాల్, రఘు మాస్టర్, యానీ మాస్టర్, యశ్ ఇలా అందరూ జడ్జ్‌లుగా వచ్చారు. ఎంతో గ్రాండ్‌గా ప్రారంభించిన ఈ షో అనుకున్నంత స్థాయిలో వర్కవుట్ కావడం లేదు. అందుకే మళ్లీ మోనాల్‌ను రంగంలోకి దింపారు. లవ్ ట్రాకులు, రొమాంటిక్ షాట్స్, అందాల ఆరబోతకు తెరదీశారు. యశ్ మాస్టర్, మోనాల్ మధ్య బాగానే రొమాన్స్ ప్లాన్ చేశారు.

తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలోనూ మోనాల్ మళ్లీ తనకు అలవాటైన హగ్గులను ఇచ్చింది. బిగ్ బాస్ షోలోనూ మోనాల్ చేసింది కూడా అదే. ఇక్కడా ఆమె చేస్తోంది కూడా అదే. అసలు డ్యాన్స్ షోలకు జడ్జ్‌లకు ఉండాల్సిన అర్హతలేంటో కూడా తెలియడం లేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. డ్యాన్స్ ప్లస్ షోలోను ఇలాంటి దరిద్రమేనా, హగ్గుల కోసమే ఆమెను తీసుకున్నారా? అంటూ ఫైర్ అవుతున్నారు.