L2 Empuraan: ఇండియన్ సినిమాల్లో మలయాళ చిత్రాలకు సాధారణంగా ఉండే మార్కెట్ పరిమితంగానే ఉంటుంది. కానీ కొన్ని సినిమాలు ఆ హద్దులను చెరిపేసి కొత్త ట్రెండ్ ను తీసుకొస్తాయి. మోహన్‌లాల్ నటించిన ఎల్2: ఎంపురాన్ ఇప్పుడు అలాంటి సినిమాగా మారుతోంది. ‘లూసిఫర్’కు సీక్వెల్‌గా రూపొందిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ ఇప్పటికే టీజర్, ట్రైలర్‌లతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది.
పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పక్కాగా మల్టీ లాంగ్వేజ్ విడుదలకు రెడీ అవుతోంది. కేవలం కేరళలోనే కాదు, తమిళనాడు, తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, ఉత్తరభారత రాష్ట్రాల్లో కూడా మంచి ఓపెనింగ్స్ దిశగా అడుగులు వేస్తోంది. అంతేకాదు, ప్రీ సేల్ బుకింగ్స్‌లోనే ఈ సినిమా చరిత్ర సృష్టిస్తోంది. విడుదలకు వారం ముందు నుంచే ఈ స్థాయి బుకింగ్స్ కావడం అంటేనే ఎల్2పై ఎంతగా హైప్ ఉందో అర్థమవుతోంది.
ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.20 కోట్లు ప్రీ సేల్ ద్వారా వసూలు చేసింది. ఇది మలయాళ సినిమా ఇండస్ట్రీ హిస్టరీలోనే అత్యధికమైన ప్రీ-రిలీజ్ బిజినెస్. బుక్ మై షోలో గంటకు లక్ష టికెట్లు అమ్ముడవడం సాధారణమైన విషయం కాదు. ఈ స్థాయి బుకింగ్స్ ప్రభాస్ లాంటి స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే సాధ్యమయ్యేవి. మోహన్‌లాల్ సత్తా ఏమిటో మరోసారి రుజువైంది.
ఈ చిత్రం మార్చి 27న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ వసూళ్లను చూస్తుంటే ఓపెనింగ్ డే కలెక్షన్లు కనీవినీ ఎరుగని రేంజ్‌లో ఉండేలా కనిపిస్తోంది. ఒక మలయాళ చిత్రానికి దేశవ్యాప్తంగా ఈ స్థాయిలో స్పందన రావడం నిజంగా సంచలనమే. ఎల్2: ఎంపురాన్ ఇప్పటి వరకు బజ్‌తో ఆకట్టుకుంది, ఇప్పుడు బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టడమే మిగిలింది!