Mohan Babu: మంచు కుటుంబంలో జరుగుతున్న విభేదాలు గురించే గంట గంటకు ఒక వార్త బయటకు వస్తోంది అయితే మోహన్ బాబు పై తన కొడుకు మనోజ్ దాడి చేశారని స్పష్టంగా తెలుస్తోంది. అదేవిధంగా మోహన్ బాబు బౌన్సర్స్ కూడా మనోజ్ పై దాడి చేశారని, దీంతో ఆయన గాయాలు పాలైనట్లు మెడికల్ రిపోర్ట్స్ కూడా ఇటీవల వెళ్లడైన సంగతి తెలిసిందే. ఇలా ఈ కుటుంబంలో పెద్ద ఎత్తున గొడవలు చోటు చేసుకుంటూ ఉన్న నేపథ్యంలో ఎన్నో విషయాలు బయటకు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే మంచు మోహన్ బాబు మనోజ్ గురించి ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడిన ఒక ఆడియో కాల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇందులో ఈయన ఎంతో ఎమోషనల్ అవుతూ తన కొడుకు గురించి బాధపడ్డారని తెలుస్తోంది. ఒరేయ్ మనోజ్ నిన్ను ఎంత అపురూపంగా..గారాబంగా పెంచాను రా.. అందరికంటే నిన్నే చాలా ప్రేమగా చూసుకున్నాను మంచి మంచి చదువులు చదివించాను.
ఎంతో ప్రేమగా పెంచుకున్న నిన్ను ఈ రోజు నువ్వే నా గుండెల పై తన్నావు కదరా…ప్రతి ఫ్యామిలీలో గొడవలు ఉంటాయి. నీకు అన్నీ ఇచ్చినా, నాకు ఆపకీర్తి తెచ్చావ్. నీ భార్య మాటలు విని తాగుడుకు అలవాటు పడ్డావ్. నువ్వు, నీ భార్య చేస్తుంది భగవంతుడు చూస్తున్నాడు. ఇంట్లో ఉన్న నా పని వాళ్ళను ఎందుకు కొడుతున్నావు రా మూడు రోజుల నుంచి ఏం జరుగుతుందో చూడు మీ అన్న ఎంతో కష్టపడి యూనివర్సిటీని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లారు. అలాంటిది మీ అన్నను కొడతాను అంటావు చంపుతాను అంటున్నావు. నీలాంటి వ్యక్తికి ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు అంటూ మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇలా మోహన్ బాబు ఆడియో ని బట్టి చూస్తుంటే మనోజ్ తప్పు ఉందని అర్థమవుతుంది.