Koti: మోహన్ బాబు నా ఆర్కెస్ట్రా ప్యాకప్ అన్నారు.. నువ్వు ఎవరు ప్యాకప్ చెప్పడానికి అరిచా: కోటి

Koti: తాను మోహన్ బాబు సినిమాకు మ్యూజిక్ చేస్తున్నపుడు జరిగిన ఓ సంఘటనను మ్యూజిక్ డైరెక్టర్ కోటి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇలా పంచుకున్నారు. నిజంగా ఒక మనిషికి కోపం అనేది ఎక్కువ ఉండకూడదని, తనకు మామూలుగా కోపం రాదు.. కానీ వర్క్‌లో ఏమైనా అంటే మాత్రం కొన్ని సార్లు అనకుండా ఉండలేనని ఆయన చెప్పుకొచ్చారు. మోహన్ బాబు తనను ఓ బ్రదర్‌లా చూసేవారన్న కోటి, తన టాలెంట్ ఏంటో వాళ్లకు తెలుసు కాబట్టి, సరే పడదాం.. వీడు కోపిష్టి, వీడు మూర్ఖుడు అని అనుకొని వదిలేస్తానని ఆయన నవ్వుతూ చెప్పారు. ఆయన ఊకే విసుగు తెప్పించేసరికి తన ఆర్కెస్ట్రాని ప్యాకప్‌ అనగానే.. మోహన్ బాబు సడన్‌గా వచ్చి తన ఆర్కెస్ట్రాని ప్యాకప్ అని అనేసరికి, తనకు కోపం వచ్చి మీరేంటీ సర్ ప్యాకప్‌ చెప్పేది.. చెప్తే నేను చెప్పాలి గానీ.. మీరెవరు చెప్పడానికి.. వారంతా తన ఆర్కెస్ట్రా అని బయటికి వెళ్లిపోయానని ఆయన చెప్పారు.

బయట తన కారు ఎదురు చూస్తూ ఉన్నపుడు, మోహన్ బాబు కూడా వచ్చి పక్కనే నిల్చొని, అటు వైపు తిరిగి ఆయన కారు కోసం వెయిట్ చేశారని కోటి నవ్వుతూ చెప్పారు. అలా ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయామని, ఆ తర్వాత 2 రోజులు అంతా నిశ్శబ్దంగా ఉందని, స్టూడియో అంతా ఇంత గొడవైంది ఇప్పుడేమౌవుతుందని ఎదురు చూస్తుండగా, ఆ సమయంలో గోపాల్ తన ఇంటికొచ్చి కోటీ ఏంటీ ఇదంతా అని మాట్లాడేసరికి, తర్వాత రోజు నుంచి మళ్లీ స్టూడియోకి వెళ్లడం, ఆయన రావడం అంతా మామూలైపోయింది కోటి వివరించారు.

ఇకపోతే నిజంగా చెప్పాలంటే చిరంజీవి సినిమాలకు మ్యూజిక్ చేయాలంటే చాలా భయమని కోటి అన్నారు. చిరంజీవి గారి సినిమాకు మ్యూజిక్ చేయాలని ఉంటుంది కానీ, ఒక్కసారి ఒప్పుకున్నాక గుండెల్లో రైళ్లు పరిగెడతాయని ఆయన చెప్పారు. చాలా భయం భయంగా ఉంటుందన్న ఆయన, ప్రతీ పాటా హిట్‌ అయ్యేలా చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. దానికి చాలా హోం వర్క్ చేయాలని ఆయన తెలిపారు. ఆయన సినిమాకు మ్యూజిక్ చేస్తున్నపుడు చాలా రకాల మ్యూజిక్స్ క్రియేట్ అవుతూ ఉంటాయని ఆయన నవ్వుతూ అన్నారు. అలా చేయగా చేయగా ది బెస్ట్ బయటికి రాగా, మిగిలినవి మాత్రం పక్కన పెట్టాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.