హైదరాబాదు శివార్లలోని జల్ పల్లి వేదికగా నటుడు మంచు మోహన్ బాబు ఇంట్లో కొద్దిరోజులుగా జరుగుతున్న రచ్చ గురించి అందరికీ తెలిసిందే. అయితే అది ఇంటి సమస్య కాస్త మోహన్ బాబు కి మీడియా వాళ్లకి మధ్య జరిగిన రచ్చగా మారిపోయింది. తమ ఇంట్లో జరుగుతున్న రచ్చని కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేయడంతో అందులో టీవీ9 కి చెందిన రిపోర్టర్ రంజిత్ కి తీవ్ర గాయాలు అయ్యాయి.
జర్నలిస్ట్ పై మోహన్ బాబు దాడి ఘటన రాష్ట్రంలో తీవ్రతమానం రేపింది. ఈ క్రమంలోనే బాధిత జర్నలిస్టు మోహన్ బాబు పై ఇచ్చిన ఫిర్యాదు మేరకు పహడి షరీఫ్ పోలీసులు బిఎన్ఎస్ 109 సెక్షన్ కింద మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు. అయితే తాను కావాలని దాడి చేయలేదని, అనుకోకుండా అలా జరిగిపోయింది అంటూ జర్నలిస్టు మిత్రులకి క్షమాపణ చెప్పిన మోహన్ బాబు ఈ కేసు విషయంగా తనకి ముందస్తు బెయిల్ కావాలని వేసిన పిటిషన్ హైకోర్టు రిజెక్ట్ చేసింది.
దాంతో మోహన్ బాబు వాంగ్మూలం నమోదు చేసేందుకు, అలాగే వెపన్ డిపాజిట్ కోసం ఫిల్మ్ నగర్ లోని ఆయన నివాసానికి వెళ్లారు పోలీసులు. అయితే ఆ సమయంలో మోహన్ బాబు ఇంట్లో లేరనే విషయం తెలుస్తుంది. అయితే మోహన్ బాబు తనని అరెస్టు చేస్తారని భయంతో పరారీ అయిపోయాడని, అతని కోసం పోలీసులు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
అయితే ఈ విషయంపై సదరు పోలీసులు వివరణ ఇచ్చారు. శుక్రవారం వెపన్ డిపాజిట్ కోసం మోహన్ బాబు ఇంటికి వెళ్ళగా ఆయన అందుబాటులో లేరు, రెండు మూడు రోజుల్లో వచ్చి వెపన్ డిపాజిట్ చేస్తానని మాకు మోహన్ బాబు సమాచారం ఇచ్చారు. అంతేకానీ ఆయన పరారీలో ఉన్నారని ఆయన కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని వస్తున్న వార్తలలో వాస్తవం లేదు అని పోలీసులు చెప్పుకొచ్చారు.
