Shekhar Master : నోరు జారి తలనొప్పి తెచ్చిన శేఖర్ మాస్టర్…. అనుకోకుండా మెగాస్టార్ సినిమా పేరు లీక్…!

Shekhar Master : మెగాస్టార్ ఈమధ్య వర్సు సినిమాలతో జోరు పెంచారు. ఖైదీ నంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు. సైరా నరసింహ రెడ్డి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక ఇపుడు ఆచార్య సినిమాతో రాబోతున్నారు. కొరటాల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో మరో కీలక పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నారు. ఇద్దరు కలిసి నటిస్తున్న మొదటి సినిమా కావడంతో ప్రేక్షకుల అంచనాలు మాములుగా ఉండవు.లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ షూటింగ్ ముగింపు దశలో ఉంది. వీటితో పాటు మెహర్ రమేష్ భోళా శంకర్, డైరెక్టర్ బాబీ మూవీలు పట్టాలెక్కడానికి రెడీగా ఉన్నాయి. మరో రెండు మూడు సంవత్సరాలు చిరు ఫుల్ బిజీ అయిపోయారు .

ఇక బాబీ దర్శకత్వంలో వస్తున్న సినిమా పేరు వాల్తేరు వీరన్న అంటూ ప్రచారం జరిగింది. కానీ అధికారికంగా ప్రకటించలేదు. ఇక సినిమా టైటిల్ గురించి శేఖర్ మాస్టర్ నోరు జారి సినిమా టైటిల్ ను లీక్ చేసేసారు. ఇప్పటికే వాల్తేరు వీరయ్య పాటని కూడా ప్లాన్ చేసినట్టు చెప్పాడు. దీంతో బాబీ టీం బాగా నిరాశ పడ్డారట.చిత్ర యూనిట్ సినిమా పేరును సర్ ప్రైజ్ గా ప్లాన్ చేయాలని గ్రాండ్ ఈవెంట్ ద్వారా చెప్పాలని భావించారట.కానీ ఎలా శేఖర్ మాస్టర్ ఫ్లోలో ఎలా చెప్పేయడంతో తలలు పట్టుకుంటున్నారట.

చిరంజీవికి సంబంధించిన ప్రతి అప్‌డేట్ కోసం మెగా ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురు చూస్తుంటారు. ఇక ఎలా శేఖర్ మాస్టర్ తెలియకుండానే లీక్ ఇవ్వడంతో వాళ్ళు షాక్ అయ్యారు. ఇక చిరంజీవి తన నెక్స్ట్ ఫిల్మ్ గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ కూడా ఫాస్టుగా ముగిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తోంది. ఇక కీలక పాత్రలో సల్మాన్ నటిస్తున్నారు. ఇక మెగాస్టార్ ఆచార్య ఈ నెల విడుదలకు సిద్ధం అయింది.