బాలకృష్ణకి సర్జరీ కావడంతో అలా ప్లాన్ చేసాం: నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి

P2Om5Ttz | Telugu Rajyam

నందమూరి నటసింహం బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సారి తెరకెక్కిన చిత్రం అఖండ. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని ఈ చిత్రం ఎట్టకేలకు విడుదల అవుతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా డిసెంబర్ 2వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఇదివరకే చిత్రబృందం అధికారికంగా ప్రకటించారు. ఇదిలా ఉండగా ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే అఖండ సినిమా నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి మీడియాతో ముచ్చటించారు.

ఈ క్రమంలోనే మీడియా సమావేశంలో మాట్లాడిన రవీందర్ రెడ్డి అఖండ సినిమా గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు.కరోనా సమయంలో ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని చివరికి మా సినిమా డిసెంబర్ 2వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలిపారు. ఈ సినిమాలో బాలయ్య బాబు నటన అద్భుతంగా ఉందని ద్విపాత్రాభినయంలో బాలకృష్ణ ఎంతో అద్భుతంగా నటించారని ఆయన పేర్కొన్నారు. సినిమా ప్రారంభమైన 20 నిమిషాల నుంచి చివరి వరకు సినిమాను అలాగే చూస్తూ ఉండి పోతారని రవీందర్ రెడ్డి తెలిపారు.

ఇకపోతే ఈ సినిమాప్రీ రిలీజ్ వేడుకను ఎంతో గ్రాండ్ గా చేయాలని భావించామని కానీ బాలకృష్ణ గారికి అయిన సర్జరీ కారణంగా ఈ కార్యక్రమాన్ని చాలా సింపుల్ గా శిల్పా కళా వేదికలో నిర్వహించబోతున్నామని వెల్లడించారు. బోయపాటి,బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కిన లెజెండ్ సినిమా ద్వారా విలన్ గా పరిచయమైన జగపతిబాబు కెరియర్ ఏవిధంగా అయితే టర్నింగ్ అయ్యిందో అదే కాంబినేషన్లో వస్తున్న అఖండ సినిమాలో హీరో శ్రీకాంత్ తన విలనిజాన్ని చూపించబోతున్నారని ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడారు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles