మెహబూబ్ లీక్ వల్లనే ‘సోహెల్’ బిగ్ బాస్ ఆఫర్ ఒప్పుకున్నాడా ?

mehaboob reveals sohel position

‘బిగ్ బాస్’ మొదటి సీజన్ నుంచి ఒక సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. టాప్ 5లో ఉన్న కంటెస్టెంట్లకు బిగ్ బాస్ రూ. 25 లక్షల ఆఫర్ ఇస్తుంటారు. ఈ పాతిక లక్షలు తీసుకుంటే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేయొచ్చు. అయితే ఇప్పటి వరకూ కూడా ఏ కంటెస్టెంట్ డబ్బు తీసుకుని ఫైనల్ పోరులో డ్రాప్ అయ్యి బయటకు వచ్చింది లేదు. అయితే సొహైల్ తొలిసారిగా ఈ ఆఫర్ కి అంగీకరించి మనీ తీసుకుని ఫైనల్ పోరాటం నుండి తెలివిగా తప్పుకున్నాడు.

mehaboob reveals sohel position
mehaboob reveals sohel position

నిన్నటి ఎపిసోడ్‌లో మెహబూబ్ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లాడు.. సొహైల్‌ని చూసి చాలా ఎమోషనల్ అయ్యాడు. సోహైల్ కి అర్ధమయ్యేలా సింగల్ ఫింగర్ చూయిస్తూ అభిజీత్ వైపు , మూడు వేళ్ళను చూపిస్తూ సొహైల్‌కి తన ప్లేస్ నెంబర్ 3 అని లీక్ చేసినట్టుగా ఈ వీడియోలో కనిపించింది. సోహెల్ చూస్తున్నప్పుడు మెహబూబ్ మూడు వేళ్లను చూయించటం క్లియర్ గా అర్ధమవుతుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇక కథ మొత్తం అర్ధం చేసుకుని ఎలాగూ తనది మూడో స్థానం అని ముందే బిగ్ బాస్ రూ.25 లక్షల ఆఫర్ ప్రకటించగానే ఒప్పేసుకున్నాడట.