మోనాల్‌ని మ‌ళ్లీ కాపాడిన బిగ్ బాస్.. ఎలిమినేట‌ర్ ఎవ‌రో రాహుల్ షో బ‌య‌ట‌పెట్టింది!

బిగ్ బాస్ సీజన్ 4లో రోజులు గ‌డుస్తున్న కొద్ది సంఖ్య త‌గ్గుతుంది. ఒక్కొక్క‌రుగా హౌజ్‌ని వీడుతున్నారు. ఈ వారం నామినేష‌న్‌లో ఆరుగురు స‌భ్యులు( అభిజీత్, హారిక, మెహబూబ్, సోహెల్, అరియానా, మోనాల్) ఉండ‌గా, వీరిలో మోనాల్ లేదంటే మెహ‌బూబ్ ఎలిమినేట్ అవుతార‌ని గ‌త రెండు రోజులుగా వార్త‌లు దావానంలా వ్యాపించాయి. మోనాల్ బిగ్ బాస్ ద‌త్త పుత్రిక కాగా ఆమెను అంత ఈజీగా ఎలిమినేట్ చేసే రిస్క్ తీసుకోడు బిగ్ బాస్. కంప‌ల్స‌రీ మెహ‌బూబ్‌నే ఎలిమినేట్ చేస్తాడు అని కొంద‌రు జోస్యాలు చెప్పుకొచ్చారు. అన్న‌ట్టుగానే మెహ‌బూబ్ ఈ రోజు బిగ్ బాస్ గ‌డ‌ప దాటి బ‌య‌ట‌కు వ‌చ్చాడు.

బిగ్ బాస్ స్టేజ్‌పై నుండి ఇంటి స‌భ్యుల‌తో మాట్లాడిన త‌ర్వాత కంటెస్టెంట్ డైరెక్ట్‌గా రాహుల్ సిప్లిగంజ్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ బజ్ షోకి హాజ‌రు అవుతుంటారు. ఎలిమినేట్ అయిన మెహ‌బూబ్ కూడా నాగార్జున తో పాటు ఇంటి స‌భ్యుల‌కు వీడ్కోలు చెప్పి షోకు వెళ్ళాడు. ఈ షోలో మెహ‌బూబ్ ని ఇంట‌ర్వ్యూ చేస్తున్న స‌మ‌యంలో ఎవ‌రో ఫొటో తీసి బ‌య‌ట‌కు రిలీజ్ చేశారు. దీంతో ఈ వారం మెహ‌బూబ్ ఎలిమినేట్ అయ్యాడ‌ని షో చూడ‌కుండానే క‌న్‌ఫాం చేస్తున్నారు.

దివి ఎలిమినేష‌న్ స‌మ‌యంలోను రాహుల్ షో ఆమె ఎలిమినేట్ అవుతుంద‌నే విష‌యం బ‌య‌ట‌పెట్టింది. ఎలిమినేట్ అయిన వాళ్లంద‌రి ఫొటోలు ఓ బోర్డ్ పై పెడుతుండ‌గా, రాహుల్ షేర్ చేసిన ఫొటోలో దివి ఫొటో కూడా ఉండ‌డంతో ఆ వారం దివి ఎలిమినేట్ అవుతుంద‌ని భావించారు. ఊహించ‌ని ఆలోచ‌న‌ల‌కు ఆ ఫొటో క్లారిటీ ఇచ్చింది. ప్ర‌స్తుతం బిగ్ బాస్ సీజ‌న్ 11వ వారంలోకి అడుగుపెట్ట‌గా, ఇంట్లో ఎనిమిది మంది మాత్ర‌మే ఉన్నారు. వీరిలో టాప్ 5లో ఎవ‌రు ఉంటార‌నే దానిపై ఇప్ప‌టికే జోరుగా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.