ఇండస్ట్రీ టాక్ : “విశ్వంభర” లో చిరు అడుగు పడేది..

సినీ పరిశ్రమ దగ్గర టైం మారుతూ ఉండడంతో హీరోలు కూడా తమ ట్రెండ్ ని మారుస్తూ వస్తున్నారు. అలా తమిళ్ లో ఆల్రెడీ ఉలగనయగన్ కమల్ హాసన్ మరియు సూపర్ స్టార్ రజనీకాంత్ లాంటి స్టార్ హీరోలు తమ ఏజ్ కి తగ్గ పాత్రలు చేస్తూ సెన్సేషనల్ హిట్ లు అందుకోగా ఇదే బాటలో అయితే టాలీవుడ్ సీనియర్ తారలు కూడా నడవడం స్టార్ట్ చేశారు.

అయితే ఈ హీరోస్ లో మెగాస్టార్ చిరంజీవి రియలైజ్ అవ్వడానికి మాత్రం బాగా సమయం తీసుకున్నారని చెప్పాలి. పైగా రీమేక్ షాక్ తో బాస్ ఫైనల్ గా స్ట్రైట్ సినిమాలకి వచ్చారు. అయితే ఆ చిత్రాల్లో ఇపుడు మెగా ఫ్యాన్స్ అత్యంత ఎక్కువగా ఎగ్జైట్ అవుతున్న చిత్రమే “విశ్వంభర”.

యంగ్ దర్శకుడు మల్లడి వశిష్ట దీనిని తెరకెక్కిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు సుమారు 200 కోట్ల హై బడ్జెట్ తో అయితే ఈ సినిమాని చేయనున్నారు. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుంది చిరు ఎప్పుడు సెట్స్ లోకి అడుగు పెడతారు అనే దానిపై ఇంట్రెస్టింగ్ రూమర్స్ ఇప్పుడు మొదలయ్యాయి.

వీటితో ఈ సినిమాలో చిరు ఈ నవంబర్ లోనే లేదా డిసెంబర్ నుంచే రంగంలో దిగిపోనున్నారని తెలుస్తుంది. అయితే ముందు చిరు లేని కొన్ని సీన్స్ చేసుకొని నెక్స్ట్ మెగాస్టార్ పై చిత్రీకరణ స్టార్ట్ చేయనున్నారని సమాచారం. మరి ఈ సినిమా బిగ్గెస్ట్ ఫాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కుతుండగా మళ్ళీ మెగా ఫ్యాన్స్ అయితే చిరుని ఈ తరహాలో సినిమాలో చూడాలని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.