Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి నటన ప్రతిభ గురించి అందరికీ తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న చిరంజీవి కొన్ని కారణాలవల్ల ఇండస్ట్రీకి దూరమయ్యారు.అయితే ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ఒక వైపు సినిమాలు మరో వైపు పలు వాణిజ్య ప్రకటనలతో మెగాస్టార్ బిజీగా మారిపోయారు. గతంలో థమ్స్ అప్ యాడ్ ద్వారా బాగా ఫేమస్ అయిన మెగాస్టార్ మరోసారి స్వగృహ రియల్ ఎస్టేట్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ రియల్ ఎస్టేట్ వాణిజ్య ప్రకటనలకు సంబంధించిన యాడ్ లో చిరంజీవి ఎంతో అద్భుతంగా నటించారు. ఇక ఈ యాడ్ లో చిరంజీవితో పాటు సీనియర్ నటి ఖుష్బూ కూడా నటించారు. ఇక బుల్లితెర స్టార్ యాంకర్ గా కొనసాగుతున్న అనసూయ కూడా ఈ యాడ్ లో పాలుపంచుకున్నారు. కేవలం కొన్ని నిమిషాల నిడివిగల ఈ యాడ్ ను సుకుమార్ డైరెక్ట్ చేయగ ఈ యాడ్ ఎంతో అద్భుతంగా వచ్చింది. ఇక ఈ యాడ్ షూటింగ్ కోసం మెగాస్టార్ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
యాడ్ షూటింగ్ కోసం మెగాస్టార్ చిరంజీవి ఏకంగా ఏడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. చాలా తక్కువ సమయానికి మెగాస్టార్ చిరంజీవి ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకోవడంతో ప్రతి ఒక్కరు ఎంతో ఆశ్చర్యపోతున్నారు. ఈ క్రమంలోనే మెగా అభిమానులు మెగాస్టార్ రేంజ్ అంటే అది ఆయన ఎక్కడున్నా మెగాస్టారే అంటూ తమ అభిమాన నటుడి గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు.
