కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఆచార్య. మెగా పవర్ స్టార్ రాం చరణ్ – నిరంజన్ రెడ్డి నిర్మాతలు. కొరటాల శివ – మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమా. కాగా ఈ సినిమాలో చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. రెజీనా కసాండ్ర స్పెషల్ సాంగ్ చేస్తోంది. మెలోడి బ్రహ్మ మణి శర్మ సంగీతమందిస్తున్నారు. ఈ సినిమాలో మొత్తం 5 పాటలున్నాయట. ఇప్పటికే ఆ పాటల కంపోజ్ మొత్తం కంప్లీటవగా 40 శాతం షూటింగ్ తో పాటు మెగాస్టర్ – రెజీనాల మీద ఒక స్పెషల్ సాంగ్ ని పూర్తి చేశారు.
అయితే లాక్ డౌన్ తో ఆగిపోయిన ఈ సినిమా ఈ నవంబర్ 9 నుంచి ప్రారంభమయింది. కాని ఇప్పట్లో మెగాస్టార్ షూటింగ్ లో జాయిన్ అయ్యే అవకాశాలు లేవని ఆయన మనహా మిగతా షూటింగ్ మొత్తం పూర్తి చేయాలన్న ఉద్దేశ్యంతో కొరటాల శివ ఆచార్య ని మొదలు పెట్టారు. కారణం మెగాస్టార్ కి కరోనా అని రిపోర్ట్స్ రావడమే. కాని ఆ రిపోర్ట్స్ తప్పుడు రిపోర్ట్స్ అని తేలడం తో ఇక మెగాస్టార్ దూకుడుగా ఆచార్య సెట్స్ లో జాయిన్ కాబోతున్నట్టు సమాచారం. అంతేకాదు నాన్ స్టాప్ గా సింగిల్ షెడ్యూల్ లో ఆచార్య సినిమాని కంప్లీట్ చేయాలని డిసైడయ్యాడట. అయితే ఒకసారి పాజిటివ్ వచ్చి ఆ తర్వాత నెగెటివ్ అని వచ్చినప్పటికీ మెగాస్టార్ క్వారంటైన్ లో ఉండాల్సిందేనని డాక్టర్స్ అంటున్నారు.
ఇప్పటికే ఈ సినిమా మొదలై రెండేళ్ళు అయిపోయింది. దర్శకుడు కొరటాల ఈ రెండేళ్ళుగా వేరే సినిమా కమిటవకుండా ఆచార్య కోసమే వర్క్ చేస్తున్నాడు. అందుకే ఎట్టి పరిస్థితులో ఏప్రిల్ వరకు ఆచార్య సినిమా ఫినిష్ చేసేలా మెగాస్టార్ సూచించారట. మెగాస్టార్ కూడా ఆచార్య సినిమా షూటిగ్ కంప్లీట్ అయ్యే వరకు మరో సినిమా చేసే ఆలోచనలో లేరని ఆచార్య నే ముందు మెగాస్టార్ టార్గెట్ గా పెట్టుకున్నారని సమాచారం. ఇక ఈ సినిమాలో అటిస్తున్న కాజల్ అగర్వాల్ హమీమూన్ ట్రిప్ నుంచి డైరెక్ట్ గా ఆచార్య సెట్స్ కి రాబోతుందట. ఈ రకంగా చూస్తే ఖచ్చితంగా 2021 సమ్మర్ కి ఆచార్య రిలీజ్ అవడం పక్కా అంటున్నారు.