తమ్ముడి ఎదుగుదల కోసం రాజకీయాలకు దూరమైన మెగాస్టార్?

Chiranjeevi Doing Politics Behind Screen For Pawan

టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. స్టార్ హీరోగా గుర్తింపు పొందిన చిరంజీవి కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చి రాజకీయాలలో ఎంట్రీ ఇచ్చాడు. అయితే రాజకీయాల్లో తనకి కలిసి రావని గ్రహించిన చిరంజీవి తాను స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశాడు. ఆ తర్వాత కొంతకాలానికి మళ్లీ సినిమాలలో రీ ఎంట్రీ ఇచ్చి ఖైదీ నెంబర్ 150 సినిమా ద్వారా హిట్ అందుకొని ఫాంలోకి వచ్చాడు.

ప్రస్తుతం మోహనరాజా దర్శకత్వంలో తెరకెక్కిన గాడ్ ఫాదర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పొలిటికల్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా నేడు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ క్రమంలో ఇటీవల చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ గురించి చిరు సెన్సషనల్ కామెంట్స్ చేశారు.

ప్రస్తుతం రాజకీయాలలో కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ అంకిత భావం కలిసిన వ్యక్తి. ఇటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ కి చాలా అవసరం అంటూ ప్రశంసించారు. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇస్తానేమో అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటేనే తన తమ్ముడు రాజకీయాలలో ఎదుగుతారన్న ఉద్దేశంతోనే రాజకీయాలకు దూరంగా ఉన్నానని ఈ సందర్భంగా చిరంజీవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా చిరంజీవి వ్యాఖ్యలు వింటే రాజకీయాలకు దూరమైన చిరంజీవి మళ్ళీ తమ్ముడికోసం రాజకీయాలలో ఎంట్రీ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.