ఇండస్ట్రీ బజ్ : ఆ హీరోయిన్ తో మెగాస్టార్ రెండోసారి.!

మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు “వాల్తేరు వీరయ్య” భారీ హిట్ తో గట్టి కం బ్యాక్ కొట్టి మళ్ళీ తన మాస్ ట్రాక్ లోకి వచ్చిన చిరు ఇక నెక్స్ట్ అయితే దర్శకుడు మెహర్ రమేష్ తో “భోళా శంకర్” అనే సినిమా చేస్తున్నారు. అయితే ఇంట్రెస్టింగ్ గా ఇది రీమేక్ చిత్రం అయినప్పటికీ టీజర్ తర్వాత అన్నీ మారాయి.

పర్లేదు ఈ సినిమా చూసేటట్టే ఉంది అనిపించే రీతిలోకి భోళా శంకర్ మారగా ఈ టీజర్ తర్వాత మొత్తానికి సమీకరణాలు మారాయి. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా ఇది వీరి కాంబినేషన్ ని “సైరా” తర్వాత రెండో సినిమా.

మరి ఈ చిత్రం తర్వాత మెగాస్టార్ మరో బ్యూటీ తో రెండో సినిమా అది కూడా చాలా ఏళ్ల తర్వాత చేస్తున్నట్టుగా ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ఓ టాక్ అయితే వినిపిస్తుంది. ఇక ఇదిలా ఉండగా ఆ హీరోయిన్ మరెవరో కాదు ఇది వరకే చిరు తో “స్టాలిన్” అనే చిత్రంలో కనిపించారు.

అయితే ఇప్పుడు మళ్ళీ ఇన్నాళ్లకు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ(సోగ్గాడే చిన్ని నాయన) ఫేమ్ తెరకెక్కించనున్న ఓ ఫాంటసీ డ్రామాలో అయితే మళ్ళీ వీరి జంట కనిపించనుంది అని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ నిజం అయితే మెగాస్టార్ తో రెండో సారి వర్క్ చేసిన తక్కువ మంది హీరోయిన్స్ లో త్రిష కూడా మరొకరుగా నిలుస్తుంది. ఇక ప్రస్తుతం త్రిష తమిళ్ లో విజయ్ తో “లియో” అనే భారీ చిత్రంలో నటిస్తుంది.