మెగాస్టార్ ఫస్ట్ రివ్యూ నిజమయ్యిందే…!

1119010-chiru (1)

ఈ ఏడాది టాలీవుడ్ సినిమా దగ్గర మంచి అంచనాలు పెట్టుకొని వచ్చిన పలు తాజా చిత్రాల్లో సీనియర్ హీరోయిన్ అనుష్క హీరోయిన్ గా యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా కొత్త దర్శకుడు మహేష్ బాబు తెరకెక్కించిన ఓ ఇంట్రెస్టింగ్ ఎంటర్టైనర్ చిత్రమే “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”.

కాగా ఈ చిత్రం అనుష్క నుంచి అవైటెడ్ థియేట్రికల్ రిలీజ్ గా చాలా కాలం తర్వాత అయితే వచ్చింది. మరి ఈ సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎగ్జైటెడ్ గా ఉండగా ఒక వాయిదాతో అయితే సినిమాని తీసుకొచ్చారు. అయితే ఈరోజు సినిమా రిలీజ్ చేసినప్పటికీ సినిమా మొట్ట మొదటి రివ్యూ మాత్రం మెగాస్టార్ చిరంజీవి అందించిన సంగతి అందరికీ తెలిసిందే.

దీనితో ఈ సినిమాకి అలాగే సినిమా యూనిట్ కి కూడా మెగాస్టార్ నుంచి పెద్ద బూస్టప్ లా మారింది. అయితే మెగాస్టార్ ఇచ్చిన ఫస్ట్ పాజిటివ్ రివ్యూ తోనే స్టార్ట్ కాగా ఇపుడు సినిమా రిలీజ్ కి వచ్చేసరికి అయితే ఈరోజు నుంచి కూడా ఆడియెన్స్ సహా సినీ విశ్లేషకులు నుంచి కూడా పాజిటివ్ టాక్ నే ఎక్కువ మొదలైంది.

దీనితో మెగాస్టార్ నుంచి వచ్చిన మొట్ట మొదటి రివ్యూ మాత్రం తప్పు కాలేదు అని చెప్పాలి. అయితే ఈ విషయంలో ఇంట్రెస్టింగ్ గా వేరే వాళ్ళ సినిమాని ఇంత బాగా జడ్జ్ చేసే మెగాస్టార్ తన సినిమాలు ఎందుకు ఇలాంటి సినిమాలు చేసి మాకు ఇస్తున్నారు అని కొందరు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వాపోతున్నారు. మరి నెక్స్ట్ నుంచి అయినా మెగాస్టార్ తన సినిమాల విషయంలో జాగ్రత్తగా ఉంటారో లేదో చూడాలి.