త్రివిక్రమ్ స్క్రిప్ట్ చదివిన చిరంజీవి .. ఈ పాయింట్ దగ్గర ఓకే చెప్పేశాడు !?

Megastar Chiranjeevi to act in Trivikram direction

డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలా? ఆయన దర్శకత్వ ప్రతిభను ఎన్నో సినిమాల్లో చూశాం. ఆయన్ను అందరూ మాటల మాంత్రికుడు అని పిలుస్తుంటారు. ఆయన సినిమాల్లో డైలాగులు మామూలుగా ఉండవు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన సినిమాలోని డైలాగుల కోసమే సినిమాకు వెళ్లేవాళ్లు కోకొల్లలు. రీసెంట్ గా అల వైకుంఠపురములో సినిమా సక్సెస్ తో మాంచి ఊపుమీద ఉన్నారు త్రివిక్రమ్.

Megastar Chiranjeevi to act in Trivikram direction
Megastar Chiranjeevi to act in Trivikram direction

కట్ చేస్తే.. మెగాస్టార్ చిరంజీవితో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ సినిమా చేయబోతున్నారు. ఈ మాట వింటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి కదా. అవును.. వీళ్లిద్దరి కాంబోలో ఓ సినిమా రాబోతున్నది. మెగాస్టార్ చిరంజీవి సినిమా అనగానే మాస్ సినిమా అయి ఉంటుంది అని అనుకోకండి. ఎందుకంటే.. వీళ్లిద్దరి కాంబోలో వస్తున్న సినిమా ఫుల్లు కామెడీ సినిమా.

అవును.. ఈసారి మెగాస్టార్ చిరంజీవి  ప్రేక్షకులను తన కామెడీతో కడుపుబ్బా నవ్వించబోతున్నారట. అందుకే వీళ్లిద్దరూ కలిశారు. త్రివిక్రమ్ సినిమాల్లోనూ కామెడీకి లోటుండదు. అందుకే ఇద్దరూ కలిసి తెరపై కామెడీని పండించడానికి సిద్ధమవుతున్నారు.

కేవలం చిరంజీవి కోసమే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ కథను సిద్ధం చేసుకున్నారట. ఆ కథ కూడా ఎంత ఫన్నీగా ఉంటుందట అంటే… దొంగ స్వామీలు, దొంగ బాబాలపై రాసిన కథ అట అది. ఇక.. ఈ సినిమాలో చిరంజీవి స్వామీజీ వేషంలో ఫుల్లుగా కామెడీ పండిస్తారని తెలుస్తోంది.

ఇప్పటికే చిరుకు త్రివిక్రమ్ ఓ లైన్ కూడా చెప్పారట. చిరు ఓకే చెప్పడం కూడా అయిపోయిందట. చిరుకు కథ సూపర్ గా నచ్చేసిందట. దీంతో వెంటనే ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇఛ్చేశారట చిరు.

సినిమాలో ఫుల్లు కామెడీని పంచడమే కాదు.. సోషల్ మెసేజ్ కూడా ఇవ్వనున్నారట. చిరంజీవి సినిమా అంటేనే ఏదో ఒక మెసేజ్ ఉంటుంది. అయితే కామెడీతో పాటు మెసేజ్ కూడా ఇస్తున్నారు అంటే ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు.

ఇక.. చిరు ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో చిరు నటిస్తున్నారు. ఆచార్య సినిమా తర్వాత చిరు త్రివిక్రమ్ సినిమాలో నటిస్తారట. అలాగే.. త్రివిక్రమ్ కూడా జూనియర్ ఎన్టీఆర్ 30వ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమా పూర్తవగానే చిరు సినిమాను పట్టాలకెక్కించనున్నారు. మొత్తానికి చిరు అభిమానులకు పండుగ లాంటి వార్త ఇది. చిరంజీవి కామెడీ ఎంటర్ టైనర్ లో నటిస్తున్నారు అంటే ఆయన ఫ్యాన్స్ ఊరుకుంటారా? మెగా ఫ్యాన్స్ సందడి ఇక మామూలుగా ఉండదు.. అదిరిపోతుంది అంతే.