కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిషపై తమిళ నటుడు మన్సూర్ ఆలీ ఖాన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశ మవుతున్నాయి. ఆయన వ్యాఖ్యలపై సినీలోకం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ విషయంలో తమిళ, టాలీవుడ్ చిత్ర ప్రముఖులు త్రిషకు అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు లోకేశ్ కనగరాజ్, నటి మాళవికా మోహనన్, గాయని చిన్మయి, టాలీవుడ్ హీరో నితిన్ సహా పలువురు స్టార్స్ త్రిషకు మద్దతు పలికారు.
ఈ కాంట్రవర్సీపై తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. మన్సూర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిరచారు. ఈ మేరకు చిరు ఓ ట్వీట్ చేశారు. ‘త్రిష గురించి నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. ఇలాంటి వ్యాఖ్యలు కేవలం ఒక ఆర్టిస్ట్‌కు మాత్రమే కాదు ఏ స్త్రీని అనడానికి అయినా అసహ్యంగా ఉన్నాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాలి. వక్రబుద్ధితో ఇలాంటివి మాట్లాడుతున్నారు. త్రిషకు మాత్రమే కాదు ఇలాంటి అనుభవం ఏ అమ్మాయికి వచ్చినా నేను అండగా, సపోర్ట్‌గా నిలబడతాను’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ చిరు ట్వీట్ వైరల్ అవుతోంది.