టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా గుర్తింపు పొందిన చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎవరి సపోర్టు లేకుండానే ఇండస్ట్రీలో హీరోగా అత్యున్నత స్థానానికి చేరుకొని మెగా సామ్రాజ్యాన్ని సృష్టించాడు. ఆ సామ్రాజ్యానికి అధిపతిగా అగ్ర శిఖరాలను చేరుకున్న చిరంజీవి.. ఉన్నతమైన వ్యక్తిత్వంతో వ్యవహరిస్తూ ఉంటాడు. అందుకే చిరంజీవిని అందరూ టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా భావిస్తారు. ఇదిలా ఉండగా ఇటీవల అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవిపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవితో ఫోటోలు దిగటానికి అభిమానులు గుమికూడి ఆయనతో ఫోటోలు దిగుతుంటే… గరికపాటి అసహనం వ్యక్తం చేస్తూ.. చిరంజీవి గారు ఆ ఫోటో సెషన్ ఆపకపోతే.. ఇక్కడి నుండి వెళ్ళిపోవటానికి నాకు అభ్యంతరం లేదు అంటూ చిరంజీవి గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే ఆ సమయంలో చిరంజీవి పంతానికి పోకుండా గరికపాటి చెప్పిన వెంటనే ఫోటో సెషన్ ఆపి ఆయన పక్కన వచ్చి కూర్చున్నారు. అయితే గరికపాటి చిరంజీవి పట్ల అలా వ్యవహరించటంతో మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ గరికపాటి పై విమర్శలు గుప్పించారు.
అయితే తాజాగా చిరంజీవి ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ మహిళా అభిమానులు అందరూ ఆయనతో ఫోటో దిగటానికి సిద్ధమవుతుండగా వెంటనే మెగాస్టార్ ..” వారు ఇక్కడ లేరు కదా ” అంటూ.. అప్పుడు జరిగిన సంఘటన గురించి గరికపాటి పై సైలెంట్ గా సెటైర్ వేశారు. ఈ విషయం అర్ధమైన వారందరూ ఒక్కసారిగా నవ్వారు. గరికపాటి పై చిరంజీవి ఇలా సెటైర్ వేయడంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ చిరంజీవికి ఎక్కడ తగ్గాలో కాదు…ఎక్కడ నెగ్గాలో కూడా తెలుసు అంటూ తమ అభిమాన హీరోని పొగడ్తలతో ముంచేస్తున్నారు.