చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్న తొలి చిత్రం పట్ల పరిశ్రమలో ఆసక్తికర చర్చ సాగుతోంది. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమాకు మెగాస్టార్ హీరోగా, అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. చిరు సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేసిన కూతురు ఇప్పుడు నిర్మాతగా తండ్రి సినిమాకు బాధ్యతలు చేపడుతుండటం విశేషం. ఇక చిరు అభిమానం కంటే ఎక్కువగా భావిస్తున్నా, బడ్జెట్ విషయంలో మాత్రం పూర్తి ప్రొఫెషనల్ గానే వ్యవహరిస్తున్నారని వర్గాలు చెబుతున్నాయి.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాకు చిరంజీవి రెమ్యునరేషన్‌పై ఎలాంటి డిస్కౌంట్స్ ఉండవని, మార్కెట్ రేంజ్‌లోనే చెల్లింపు ఉంటుందని ఇండస్ట్రీ టాక్. అంటే, రూ. 50 కోట్లు లేదా అంతకన్నా ఎక్కువ కావచ్చు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వంటి సంస్థలు చిరంజీవికి భారీ ఆఫర్లు ఇస్తుండగా, కూతురు నిర్మిస్తున్న సినిమాకైనా రేటు తగ్గించవలసిన అవసరం లేదనే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. షూటింగ్‌కు ముందు కొంత మొత్తం అడ్వాన్స్‌గా చెల్లించి, మిగతాది ఫేజ్‌ల వారీగా పూర్తిచేయనున్నారు. సాహుగారపాటి కూడా సహనిర్మాతగా ఉన్నందున ఫైనాన్షియల్ బాధ్యతలు సమంగా పంచుకునేలా ప్లాన్ చేసినట్టు సమాచారం.
ఇక సుస్మిత ఇప్పటికే ‘ఖైదీ నెం.150’, ‘సైరా’, ‘విశ్వంభర’ వంటి చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేశారు. నిర్మాణంలో ‘శ్రీదేవి శోభన్ బాబు’ వంటి ప్రయత్నం ఉన్నప్పటికీ, ఈసారి తన తండ్రి సినిమాతో మాస్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తోంది. 2026 సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమా చిరంజీవికి 157వ చిత్రం. కథ, కాంబినేషన్, బడ్జెట్ విషయంలో భారీ అంచనాలతో మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఫ్యామిలీ బ్యానర్ కావడం, దర్శకుడిగా అనీల్ రావిపూడి ఉండటంతో ఈసారి విజయానికి అన్ని అంశాలూ కలిసొస్తాయని భావిస్తున్నారు.