మెగా డాటర్ నిహారిక కొణిదెల పెళ్లి వేడుకల హవా ఏ రేంజ్ లో కొనసాగుతున్నాయో సోషల్ మీడియాపై ఒక లుక్కేస్తే ఈజీగా అర్థమవుతుంది. పెళ్లి ఎక్కడో ఉదయ్ పూర్ లో జరుగుతున్నప్పటికీ తెలుగు జనాలకు మాత్రం నిత్యం ఏదో ఒక ఫొటో దర్శనమిస్తోంది. దీంతో వేడుక ఇక్కడే జరుగుతోందనే ఒక ఫీలింగ్ కూడా వస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక వేడుకకు మెగా హిరోలందరు వచ్చేశారు.
రాడేమో అనుకున్న పవన్ కళ్యాణ్ కూడా పెద్ద కొడుకు పెద్ద కూతురితో వచ్చి సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఆ సంగతి అటుంచితే పెళ్లికి నిహారిక కోసం మెగాస్టార్ అత్యంత ఖరీదైన గిఫ్టును ఇచ్చాడట. సోషల్ మీడియాలో మొత్తం ఇప్పుడు ఇదే న్యూస్ వైరల్ అవుతోంది. ఆయన సతీమణి సురేఖతో కలిసి మెగాస్టార్ ఒక నెక్లెస్ ను బహుకరించినట్లు తెలుస్తోంది. ఆ నెక్లెస్ ను సురేఖ దగ్గరుండి డిజైన్ చేయించినట్లుగా కూడా టాక్ వస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా కూతురి పెళ్లి కానుకగా మెగాస్టార్ ఇచ్చిన గిఫ్ట్ చాలా బాగుందని పెళ్లికి వచ్చిన వారు కూడా తెగ మాట్లాడుకుంటున్నారట.
మెగాస్టార్ చిరంజీవికి నిహారిక అంటే చాలా ప్రేమ. ఫస్ట్ మెగా లేడి యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకోవడంతో చాలా సార్లు ప్రశంసించారు. ఇక ఇప్పుడు చైతన్య జొన్నలగడ్డ సతీమణి అవుతున్న సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ మా చేతిలో పెరిగిన చిన్నారి అంటూ ఎమోషనల్ గా కామెంట్స్ చేస్తూ చిన్నప్పటి ఫొటో కూడా జత చేశారు. ఇక పెళ్లిలో మెగాస్టార్ తబ భార్య సతీమణితో కలిసి బాగానే డ్యాన్స్ చేస్తున్నారు. వేడుకలో ఎక్కువగా మెగాస్టార్ పాటలే వినిపిస్తున్నాయి. ఇక వేడుకకు పలువురు సీని ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరుకానున్నట్లు సమాచారం.