తనువులు వేరైనా లక్ష్యం ఒక్కటే.. పవన్ కోసం చిరంజీవి భావోద్వేగ ట్వీట్

megastar chiranjeevi birthday wishes to pawan kalyan

తనువులు వేరైనా లక్ష్యం ఒక్కటే

మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే

తన గుండెచప్పుడు ఎప్పుడు జనమే

తన ఆశయం ఎల్లప్పుడూ జనహితమే

జనసేనానికి పుట్టినరోజు శుభాకాంక్షలు

కళ్యాణ్ బాబు హ్యాపీ బర్త్ డే.. అంటూ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కు భావోద్వేగ ట్వీట్ తో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

megastar chiranjeevi birthday wishes to pawan kalyan
megastar chiranjeevi birthday wishes to pawan kalyan

నిజానికి పవన్ కళ్యాణ్ ఈ స్టేజ్ లో ఉన్నారంటే కారణం మెగాస్టార్ చిరంజీవి. ఆ విషయాన్ని పవన్ కూడా ఎన్నో సార్లు చెప్పారు కూడా. మెగాస్టార్ చిరంజీవి అంటే కూడా పవన్ కు ఎంతో అభిమానం, గౌరవం. పవన్ కు చిరంజీవి తర్వాతే ఎవ్వరైనా.

అలాగే చిరంజీవికి కూడా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటే ఎనలేని ప్రేమ. తనపై ఉన్న ప్రేమను ఇలా ట్వీట్ రూపంలో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు చిరు.

ఇక..  ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెగా ఫ్యాన్స్ అంతా అన్నదమ్ముల మధ్య ఉన్న అనుబందాన్న గుర్తు చేసుకుంటున్నారు.

మరోవైపు పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా #HBDPawanKalyan హ్యాష్ టాప్ టాప్ ట్రెండింగ్ లో ఉంది. మెగా ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్ తో పాటు సెలబ్రిటీలు కూడా పవన్ కళ్యాణ్ కు పుట్టిన రోజు శుభాకంక్షలు చెబుతూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ బర్త్ డేనే ట్రెండింగ్ టాపిక్.

ఇక పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ సినిమా అప్ డేట్స్ వస్తున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ అయింది.  ఆ తర్వాత తన 27వ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ అయింది.

మొత్తానికి పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం తమ హీరో పుట్టిన రోజున పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు.