పూనకాలు తెప్పిస్తున్న ‘చిరు 154’ మూవీ పోస్టర్

Megastar chiranjeevi 154th movie update

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే కానుకగా అందుతున్న మూవీ అప్డేట్స్ తో మెగా అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. త్వరలో విడుదలకు సిద్దమవుతున్న ‘ఆచార్య’ మూవీ నుండి న్యూ పోస్టర్, మరో రెండు చిత్రాల టైటిల్ అనౌన్స్ మెంట్ చేశారు మేకర్స్. తాజాగా మరొక సినిమాకు సంభందించిన ప్రకటన భలే కిక్ ఇస్తుంది. చిరంజీవి కెరీర్లో 154 సినిమాగా వస్తున్న ఈ మూవీకి బాబీ దర్శకత్వం వహిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. మెగా స్టార్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ చిరంజీవి లుక్ కి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు.

పూనకాలు లోడింగ్ అంటూ కాప్షన్ పెట్టి రిలీజ్ చేసిన ఈ పోస్టర్ ని చూస్తున్న మెగా అభిమానులకి నిజంగానే పూనకాలు వస్తున్నాయట. ఆ పోస్టర్ లో ఏముందంటే… పడవను సముద్రంలోకి తీసుకెళ్లడానికి తోటి వారందరు ప్రయత్నిస్తుండగా ఆ పడవ పైన ముందు భాగంలో ఒక చేతిలో వెలిగించిన సిగెరెట్, మరో చేతిలో లంగరు పట్టుకుని లుంగీ కట్టుకుని ఉన్న చిరంజీవిని వెనుక నుండి చూపెట్టారు. చూస్తుంటే ఊర మాస్ గెటప్ లా అనిపిస్తుంది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలవుతుందని డైరెక్టర్ వెల్లడించారు. ఇప్పటికే చిరుతో చాలా సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు.