కుటుంబ సభ్యులను కాదని మరో స్టార్ హీరో నటనని మెచ్చుకున్న మెగాస్టార్…?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఉన్న పేరు ప్రఖ్యాతలు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఎవరి సహాయం లేకుండా ఒంటరిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చిరంజీవి అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు తన నటనతో మెగాస్టార్ గా అగ్ర శిఖరాలను చేరుకున్నాడు. ఒంటరిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చిరంజీవి ఇప్పుడు ఒక మెగా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి ఆ సామ్రాజ్యం నుండి ఎంతోమందిని హీరోలుగా ఇండస్ట్రీకి అందించాడు. మెగా కుటుంబం నుండి వచ్చిన హీరోలు తమదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మంచి గుర్తింపు పొందారు. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందగా తమ్ముడు పవన్ కళ్యాణ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు.

ఇక నాగబాబు కుమారుడు కూడా హీరోగా మంచి గుర్తింపు పొందాడు. అయితే మెగా కుటుంబంలో ఇంతమంది హీరోలు ఉన్నా కూడా.. మెగాస్టార్ కి మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ఒక స్టార్ హీరో అంటే చాలా ఇష్టం అని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ హీరో నటన, డాన్స్ అంటే మెగాస్టార్ కి చాలా ఇష్టం. తన కుటుంబానికి చెందిన హీరోలు నటించిన సినిమాలను వదిలేసి ఆ హీరో సినిమా చూడటానికి ఆసక్తి చూపుతారు. మెగాస్టార్ చిరంజీవిని అభిమానిగా మార్చుకున్న ఆ స్టార్ హీరో మరెవరో కాదు జూనియర్ ఎన్టీఆర్. నందమూరి తారక రామారావు మనవడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకొని సార్ హీరోగా గుర్తింపు పొందాడు.

ఇక ఇటీవల రామ్ చరణ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించి పాన్ ఇండియా హీరోగా పాపులర్ అయ్యాడు. మొదటినుండి ఎన్టీఆర్ నటన డాన్స్ అంటే చిరంజీవికి చాలా ఇష్టం. ఎన్టీఆర్ నటించిన ప్రతి సినిమా చూసి ఆ తర్వాత ఎన్టీఆర్ కి పర్సనల్గా ఫోన్ చేసి మరి తన నటన గురించి డాన్స్ గురించి చిరంజీవి మెచ్చుకునేవారు. ఇక ఇటీవల రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా రామ్ చరణ్ నటన కంటే ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉందని చిరంజీవి అందరి ముందు ఎన్టీఆర్ నటన గురించి ప్రశంసించాడు. ఇలా చిరంజీవి ఇతరులలో ఉన్న టాలెంట్ ని గుర్తిస్తూ వారిని మెచ్చుకోవటమే కాకుండా వారిని ఎంకరేజ్ చేస్తున్నాడు.