బిగ్‌బాస్‌4 గెస్ట్: ఆ హీరోలను వద్దన్న నాగ్.. లీక్ చేసిన చిరు

chiru

బిగ్ బాస్ సీజన్ 4 తెలుగు మొత్తానికి అనుకున్నట్లుగానే ఎండ్ అయ్యింది. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరో ఎప్పుడో తెలిసిపోయింది. 11 వారాల గడిచినా కూడా కనీసం కెప్టెన్ గా కూడా సెలెక్ట్ అవ్వని కంటెస్టెంట్ ట్రోపి అందుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇక బిగ్ బాస్ ఫైనల్ ట్రోపిని అభిజిత్ కు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అందించారు నాగ్.

Nagarjuna about Records Of Bigg Boss 4 Telugu

అంతా బాగానే ఉంది కాని.. మెగాస్టార్ స్టేజ్ పై చేసిన ఒక కామెంట్ వెనుక అనేక రకాల ఊహాగానాలు పూట్టుకొస్తున్నాయి. బిగ్ బాస్ నిర్వాహకులు మొదట మెగాస్టార్ ను అనుకోలేదట. మహేష్ బాబు లేదా ఎన్టీఆర్ ఇద్దరిలో ఎవరో ఒకరు ఫైనల్ గెస్ట్ గా వస్తారని ఒక టాక్ అయితే గట్టిగా వచ్చింది. ముఖ్యంగా మహేష్ అయితే ఫిక్స్ అని కూడా అన్నారు. కానీ మెగాస్టార్ వచ్చే వరకు ఒక విధంగా కొందరికి క్లారిటి రాలేదు.

ఇక బిగ్ బాస్ వేదికపై మెగాస్టార్ ఆ విషయంపై వివరణ కూడా ఇచ్చారు. మిగతా వాళ్ళు ఎవరెవరో వస్తారని తెలిసింది. కానీ నాగార్జున పట్టుబట్టి నన్ను పిలిపించారు. మరోసారి బిగ్ బాస్ కు ఇలా వస్తానని అనుకోలేదని చిరు వివరణ ఇవ్వడంతో నాగార్జున ఆ అగ్ర హీరోలను రిజెక్ట్ చేసినట్లు అర్ధమవుతోంది. ఇక మెగాస్టార్ కేవలం ఒక ఫన్ క్రియేట్ చేయడమే కాకుండా కంటెస్టెంట్స్ కు సపోర్ట్ చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవడం అందరిని ఆకర్షించింది.