మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. ఈ సినిమా విడుదలకు ముందే ప్యాన్ ఇండియా రేంజ్‌లో ఓ రికార్డ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమా కోసం భారీ టెంపుల్ సెట్‌ను రూపొందించారు.
సాధారణ ఆలయం సెట్ కాదు. ఆచార్య సినిమా కోసం హైదరాబాద్ శివారు ప్రాంతమైన కోకా పేటలో 20 ఏకరాల్లో భారీ గుడి సెట్‌ను వేశారు. ఓ గుడి సెట్ ను ఇంత పెద్ద ప్రాంతంలో క్రియేట్ చేయడం ఇండియా సినీ పరిశ్రమలోనే ఇదే తొలిసారి అని అంటున్నాయి సినీ వర్గాలు. ప్రస్తుతం ఈ సెట్‌లో చిరంజీవిపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఈ చిత్రీకరణ ఈ నెల 10వ తేదీతో పూర్తవుతుంది. ఇక రామ్‌చరణ్ సహా ఇతర నటీనటులపై కూడా ఇదే సెట్‌లో సన్నివేశాలను చిత్రీకరిస్తారట. ప్రస్తుతం రామ్‌చరణ్ కరోనా బారిన పడటంతో హోం క్వారంటైన్ లో ఉన్నారు. కొన్నిరోజుల్లోనే చరణ్ ఆచార్య చిత్రీకరణలో పాల్గొంటారు. దాదాపు నెలరోజుల పాటు చరణ్ ఈ సినిమా షూట్‌లో భాగం అవుతున్నారు. ఫిబ్రవరిలో మిగిలిన పార్ట్ ను చిత్రీకరించేలా ప్లాన్ చేసేశారట. దేవాదాయ శాఖలో అవినీతిని ప్రశ్నించేలా సినిమా కథాంశం ఉంటుందట. ఇందులో చిరంజీవి మాజీ నక్సలైట్ పాత్రలో కనిపిస్తే.. రామ్‌చరణ్ నక్సలైట్ పాత్రలో కనిపిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. సోనూసూద్ విలన్‌గా నటిస్తున్నాడు.