Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా కోసం మెగా సర్‌ప్రైజ్ గిఫ్ట్

టాలీవుడ్ మాస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కెరీర్‌లో వన్ బై వన్ సక్సెస్‌లు అందుకుంటూ, ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్‌లో తన మార్క్ చూపిస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్య ‘యానిమల్’తో బాలీవుడ్‌ను షేక్ చేసిన ఆయన, ప్రస్తుతం ప్రభాస్‌తో ‘స్పిరిట్’ అనే భారీ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు. అయితే ఈ పనుల మధ్యలో మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన ఓ కానుక దర్శకుడికి స్పెషల్ మోమెంట్‌ను అందించింది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ బ్రాండ్ అయిన ‘అత్తమాస్ కిచెన్’ ద్వారా ప్రత్యేకంగా తయారు చేసిన ఆవకాయ పచ్చడి బాటిల్‌ను సందీప్‌కు పంపించారు. దీన్ని సాదారణమైన కానుకగా కాకుండా, ప్రేమతో కూడిన జ్ఞాపకంగా దర్శకుడు స్వీకరించారు. “ఇది ఊహించనిది.. చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్యూ చరణ్ అండ్ ఉపాసన” అంటూ సందీప్ రెడ్డి వంగా తన ఇన్‌స్టా స్టోరీలో జోడించారు. పచ్చడి బాటిల్ ఫొటోతో పాటు మెగా దంపతుల చిన్న నోట్‌ కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక సినిమా విషయానికొస్తే, సందీప్ ప్రస్తుత ప్రాజెక్ట్ స్పిరిట్పై భారీ అంచనాలున్నాయి. ఇందులో ప్రభాస్ తొలిసారి పోలీస్ అధికారిగా కనిపించనుండటం సినిమాకు అడ్‌వాంటేజ్. కానీ చిత్రంలో కథానాయిక ఎంపిక చుట్టూ గతంలో కొన్ని వివాదాలు నెలకొన్నాయి. మొదట దీపికా పదుకోన్‌ను తీసుకున్నట్టు వినిపించినా, తర్వాత కొన్ని కారణాల వల్ల ప్రాజెక్ట్ నుంచి తప్పించారని టాక్. పైగా ఆమె పీఆర్ టీమ్ సినిమా కథల విషయాలను మీడియాకు లీక్ చేస్తోందంటూ, సందీప్ పరోక్షంగా ఓ పోస్ట్‌లో అసహనం వ్యక్తం చేశారు.

మహానాడులో బిగ్ షాక్ || Analyst Ks Prasad EXPOSED Mahanadu Kadapa Meeting || Chandrababu || TR