ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు సినిమాల్ని ఒకేసారి అనౌన్స్ చేయబోతున్నారట మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం ‘భోళా శంకర్’ సినిమా పనుల్లో బిజీగా వున్న మెగాస్టార్ చిరంజీవి, మరోపక్క.. కొత్తగా కమిట్ అవబోయే సినిమాలకు సంబంధించి కథా చర్చలూ జోరుగానే సాగిస్తున్నారట.
రేసులో అందరికన్నా ముందున్నాడు వినాయక్. చిరంజీవి – వినాయక్ మధ్య మంచి అనుబంధమే కాదు, సూపర్ సక్సెస్ హిస్టరీ కూడా వున్నాయ్. మొదటగా ఈ సినిమా ప్రకటనే రాబోతోందిట.
ఇంకోపక్క పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చిరంజీవి చేయబోయే సినిమాకి సంబంధించిన ప్రకటనకి కూడా రంగం సిద్ధమవుతోందని సమాచారం. మూడో సినిమా విషయమై కొంత సస్పెన్స్ వుంది. కాగా, ఈ మూడు సినిమాల్లో.. దేంట్లోనూ కొణిదెల ప్రొడక్షన్స్ ఇన్వాల్వ్‌మెంట్ వుండదట.
