Salman: సల్మాన్ కోసం మెగాస్టార్ అక్కడికే మకాం,గాడ్ ఫాదర్ షూటింగ్ అక్కడేనట!!

Salman:మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో యువ హీరోలతో సమానంగా ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి తీసిన ఆచార్య విడుదలకు సిద్ధంగా ఉంది.మరోవైపు వేదాళమ్ రీమేక్ భోళా శంకర్‌ సినిమా చేస్తున్నారు. వీటితో పాటు మెగాస్టార్ చిరు – మోహన్ రాజా కాంబోలో మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ ని తెలుగు నేటివిటీకి దగ్గరగా గాడ్ ఫాదర్ మూవీగా తెరకెక్కిస్తున్నారు.

ఇందులో మోహన్‌లాల్‌ పాత్రలో చిరంజీవి కనిపిస్తున్నారు. ఇక మాతృకలో దర్శకుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ పోషించిన కీలక పాత్రను తెలుగులో సల్మాన్‌ ఖాన్‌ చేస్తున్నారు. ఆ మధ్య సల్మానే ఈ విషయం అధికారికంగా ప్రకటించాడు కూడా.ఈ సినిమాలో స్పెషల్ ఏమిటి అంటే లేడీ సూపర్ స్టార్ నయనతార చిరు కి సిస్టర్ కేరెక్టర్ లో పవర్ ఫుల్ రోల్ లో నటించడం.ఇటీవలే నయనతారకు సంబంధించిన షెడ్యూల్ పూర్తి అయ్యింది. ఈ సినిమా షూటింగ్ కోసం సల్మాన్ ఖాన్ హైదరాబాద్ వస్తున్నాడని అన్న ప్రచారం బాగా జరిగింది. కానీ షూటింగ్‌ కోసం సల్మాన్‌ ఇక్కడికి రావడం లేదు.

మొదట అనుకున్న ప్రకారం హైదరాబాద్ లో సెట్ వేస్తున్నారని ,సల్మాన్ ఖాన్ షూటింగ్ కోసం హైదరాబాద్ వస్తున్నారన్న ప్రచారం జోరుగా జరిగింది. సినిమా షూటింగ్ కోసం సల్మాన్ఖాన్ హైదరాబాద్ కి రావడం లేదు చిరంజీవి నే షూటింగ్ కోసం ముంబై వెళ్తున్నారు అట. చిరంజీవి – సల్మాన్ ఖాన్‌ కాంబినేషన్ సీన్స్‌ను ముంబయి సమీపంలోని ఎన్డీ స్టూడియోస్‌లో చిత్రీకరించబోతున్నారట.వారం రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనున్నట్లు సమాచారం.షూటింగ్ జరిగేనన్ని రోజులు సల్మాన్ ఖాన్‌ ఫామ్ హౌస్‌లోనే చిరంజీవి ఉండబోతున్నాడని సమాచారం.ఏదేమైనా చిరంజీవి సినిమాలో,సల్మాన్‌ ఖాన్‌ అనేసరికి అంచనాలు అమాంతంగా పెరిగిపోయాయి.మెగాస్టార్ చిరంజీవి,సల్మాన్ మధ్య సన్నివేశాలు ఎలా ఉండనున్నాయో వేచి చూడాలి.