సాయి ధరమ్ తేజ్ పెళ్లి గురుంచి ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవి కామెంట్ చేసిన విషయం తెలిసిందే. వచ్చే ఏదాది సాయి ధరమ్ తేజ్ మరియు వరుణ్ తేజ్ ఇద్దరికి పెళ్లిళ్లు చేస్తాము అనే రీతిలో చెప్పారు చిరంజీవి. ఇదే విషయం పై టాలీవుడ్ లో ఇప్పుడు ఒక హాట్ చర్చ జరుగుతుంది.
అందుతున్న సమాచారం మేరకు సాయిధరమ్ తేజ్ కోసం మూడు సంభందాలు చూశారంటే. అంటే ముగ్గురిని షార్ట్ లిస్ట్ చేశారనట్టు. వారిలో ఒకరిని సాయి ధరమ్ తేజ్ కోసం ఎంపిక చేసి పెళ్లి చెయ్యడం అనే భాధ్యతను చిరంజీవి మీద పెట్టారట మెగా కుటుంభం సభ్యులు.
చూడబోతే వచ్చే ఏడాది పాటు మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి వాతావరణం కొనసాగబోతుంది. ఈ ఏడాది చివర్లో మెగా ప్రిన్సెస్ నిహారిక పెళ్లి తో మొదలయ్యే పెళ్లి సందడి, సాయి ధరమ్ తేజ పెళ్లి తో కొనసాగి, వరుణ్ తేజ్ పెళ్లి తో ముగిసేలాగ ప్లాన్ చేస్తునట్టున్నారు.