Hari Hara Veera Mallu: టాలీవుడ్ హీరో, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు ఏపీ డిప్యూటీ సీఎంగా తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. మొన్నటి వరకు రాజకీయాలలో ఫుల్ బిజీబిజీగా గడిపిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు కాస్త గ్యాప్ ఇచ్చి తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు. అందులో భాగంగానే ఇటీవల హరి హర వీరమల్లు సినిమాను పూర్తి చేసిన విషయం తెలిసిందే. దాదాపు ఐదేళ్లుగా షూటింగ్ ని జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల పూర్తి అయింది.
ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ మూవీ పవన్ షెడ్యూల్ బిజీగా ఉండటంతో షూటింగ్ లేటుగా కొనసాగడంతో విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్ గా జులై 24న హరిహర వీరమల్లు మూవీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ వస్తారని టాక్. పవన్ కల్యాణ్ ఈ చిత్రంలో వీరమల్లు అనే ధీరోదాత్తమైన యోధుడి పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే.
ట్రైలర్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ లు, ఎం.ఎం. కీరవాణి సంగీతం, 17వ శతాబ్దపు మొగల్ నేపథ్యంలో అద్భుతమైన విజువల్స్ ఉంటాయని టాక్. అయితే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి పాల్గొంటే ఈ సినిమాకు మెగా బూస్ట్ వస్తుందని, అభిమానులకు డబుల్ ట్రీట్ అవుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా ఈ భారీ పీరియాడిక్ డ్రామాకు క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ డైరెక్షన్ చేస్తున్నారు. బాబీ డియోల్ మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్ పాత్రలో, నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రీ, సత్యరాజ్ వంటి తారలు కీలక పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ట్రైలర్ లాంచ్ కు చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా వస్తే సినిమాకు ఇంకా హైప్ రావడం పక్కా అంటున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ గతంలో పలుసార్లు వాయిదా పడటంతో జూలై 3న నిర్వహించే ఈవెంట్ ను గ్రాండ్ సక్సెస్ చేసి అభిమానుల్లో కొత్త జోష్ నింపాలని నిర్మాతలు భావిస్తున్నారట. అందుకే చిరంజీవిని చీఫ్ గెస్ట్‌గా వస్తారని న్యూస్ వైరల్ అవుతోంది. మరి ఈ విషయంపై మూవీ మేకర్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.