వైరల్ : ఇక నుంచి ఓటిటిలో మెగా మాస్ “పూనకాలు”.!

ఈ ఏడాది సంక్రాంతి బరిలో భారీ అంచనాలు మధ్య వచ్చి సెన్సేషనల్ హిట్ గా నిలిచిన సినిమాల్లో మొదటి వరుసలో ఉండే సినిమా మాత్రం మెగాస్టార్ చిరంజీవి నటించిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా “వాల్తేరు వీరయ్య” ఉంటుందని చెప్పాలి. మరి వాల్తేరు వీరయ్య సినిమాలో మెగాస్టార్ తో పాటుగా మాస్ మహారాజ్ రవితేజ కూడా నటించడంతో ఈ సినిమా అభిమానులకి పూనకాలు ఇచ్చి మెగా మాస్ హిట్ గా నిలిచింది.

నిర్మాణ సంస్థ మైత్రి మేకర్స్ వారే తమ ఇన్నేళ్ల కెరీర్ లో ఏ సినిమా కూడా ఇవ్వని లాభాలు అయితే ఈ ఒక్క సినిమా అందించింది అని చెప్పారు. ఆ రేంజ్ లో హిట్ అయ్యిన ఈ సినిమా ఇక ఈరోజు నుంచి ఓటిటి లో ఆడియెన్స్ కి పూనకాలు ఇవ్వడానికి సిద్ధం అయ్యింది.

ఈ సినిమాని ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ కెరీర్ లో ఫ్యాన్సీ రేటు ఇచ్చి తీసుకున్న ఈ సినిమా ఈరోజు నుంచి నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చేసింది. తెలుగు భాషలో మాత్రమే ఈ సినిమా అయితే ఇప్పుడు స్ట్రీమింగ్ లో ఉంది.

దీనితో మరోసారి మెగాస్టార్ ఓటిటి ని అలాగే సోషల్ మీడియాని తన కంట్రోల్ లో పెట్టుకున్నారని చెప్పాలి. కాగా ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ సినిమా మరికొన్ని రోజుల్లో 50 రోజుల బ్లాక్ బస్టర్ రన్ ని థియేటర్స్ లో కంప్లీట్ చేసుకోనుంది.