మెగా కోడలు ఉపాసన గురించి పరిచయం అవసరం లేదు ఈమె సెలబ్రిటీ కాకపోయినా అపోలో హాస్పిటల్ చైర్ పర్సన్ గా విధులు నిర్వహించడమే కాకుండా ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ ఎంతో మంచి ఆదరణ పొందారు. ఇక సోషల్ మీడియా వేదికగా ఈమె ఎన్నో ఆరోగ్య సూత్రాలను కూడా తెలియజేస్తూ ఉంటారు. ఇక సినిమాల పరంగా కానీ తన వ్యక్తిగత విషయాల గురించి కానీ ఉపాసన సోషల్ మీడియాలో ప్రస్తావించారు. ఇలాంటి వాటన్నింటికీ ఉపాసన దూరంగా ఉంటారు.
ఉపాసన రామ్ చరణ్ భార్యగా మాత్రమే కాకుండా ఒక మహిళ వ్యాపారవేత్తగా కూడా జాతీయస్థాయిలో ఎంతో మంచి గుర్తింపు పొందారు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన వృత్తిపరమైన విషయాలను తెలియజేస్తూ తన భర్త రామ్ చరణ్ సినిమాలకు సంబంధించిన అప్డేట్లను కూడా అభిమానులతో పంచుకుంటారు.ఇక వీరిద్దరూ ఏదైనా వెకేషన్ కి వెళ్తే ఆ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను మాత్రమే షేర్ చేస్తుంటారు.
ఈ విధంగా ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసే ఫోటోలు, తను చెప్పే ఆరోగ్య సూత్రాలకు ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇలా రోజురోజుకు ఈమెకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయారు.ఈ క్రమంలోనే ఈమెకు ఇంస్టాగ్రామ్ వేదికగా ఏకంగా ఆరు మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉండటం విశేషం. ఈమె సెలబ్రిటీ కాకపోయినా ఓ వ్యాపారవేత్తగా జంతు ప్రేమికురాలిగా ఎంతోమందికి అభిమానిగా మారిపోయారు. ఇలా అభిమానులను సంపాదించుకోవడంలో మెగా కోడలు సైతం హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్నారని చెప్పాలి.