రూటు మార్చిన మెగా హీరో.. ఈ సినిమా అయినా తనకి సక్సెస్ ఇస్తుందా!

మెగా కాంపౌండ్ హీరో వరుణ్ తేజ్ హీరోగా నటించిన సినిమా మట్కా. ఈ సినిమా ఎన్నో అంచనాలతో బరిలో దిగింది. కానీ ఘోరంగా ఫెయిల్ అయి వరుణ్ తేజ్ కెరీర్ ని మరింత ప్రమాదంలో పడేసింది ఈ సినిమా. ఇప్పటికే వరుస ప్లాపులతో ఉన్న వరుణ్ తేజ్ కి ఈ సినిమా సక్సెస్ చాలా అవసరం కానీ ఈ సినిమా కూడా డిజాస్టర్ గా మిగలటం తో వరుణ్ తేజ్ ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. 60 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకి కేవలం 15 కోట్ల బిజినెస్ మాత్రమే జరిగింది.

వరుణ్ తేజ్ కెరియర్లో ఇదే బిగ్గెస్ట్ డిజార్డర్. దీంతో పునరాలోచినలో పడిన వరుణ్ తేజ్ తన నెక్స్ట్ సినిమా డిఫరెంట్ జోనర్ లో మంచి డైరెక్టర్ తో చేయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆయన మెర్లపాక గాంధీతో సినిమా చేయాలని నిర్ణయం తీసుకున్నారు అంట మేర్లపాక గాంధీ అంటే వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ రాజా వంటి సూపర్ హిట్ సినిమాల దర్శకుడు. ఈ సినిమాని మూవీకి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ 2025 మార్చిలో స్టార్ట్ చేయబోతున్నట్లు సమాచారం ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ రావాల్సి ఉంది అయితే ఒక విషయం లో మాత్రం మంచి అప్డేట్ ఉంది అదేమిటంటే వరుణ్ తేజ్ ఇక యాక్షన్ సినిమాలు కాకుండా కామెడీ నేపథ్యంలో ఉన్న సినిమాలు చేయాలని నిర్ణయం తీసుకున్నాడు అంట అందులో భాగంగానే మేర్లపాక గాంధీతో తీయబోయే సినిమా హారర్ కామెడీ నేపథ్యంలో రానుందట.

ఈ సినిమాకి కొరియన్ కనకరాజు అనే టైటిల్ అనుకుంటున్నట్లు సమాచారం. ఈ సినిమాలో వరుణ్ తేజ్ క్యారెక్టర్ కొత్తగా ఉంటుందని చెప్తున్నారు యూనిట్ సభ్యులు. అయితే ఈ విషయంపై మూవీ టీం అధికారిగా ప్రకటన ఏమి ఇవ్వలేదు. ఈ విషయంపై మూవీ యూనిట్ ఏ విధంగా స్పందిస్తుందో,ఈ సినిమా అయినా వరుణ్ తేజ్ కి మంచి సక్సెస్ ఇస్తుందో లేదో వేచి చూడాల్సిందే.