మెగా కుటుంబం అదృష్టం అంతా ఆమె వల్లే..?

టాలీవుడ్ లో అతి పెద్ద మార్కెట్ ఉన్న ఫ్యామిలీ లో మెగా కుటుంబం కూడా ఒకటి. మరి ఇప్పుడు మెగా కుటుంబం పెద్ద అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి తాజాగా పద్మవిభూషణ్ పురష్కారంతో మెగా ఫ్యాన్స్ సహా యావత్ టాలీవుడ్ ప్రముఖులు మరియు దేశ వ్యాప్త ప్రముఖులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తుండగా దేశ వ్యాప్తంగా మెగాస్టార్ పేరు ఇప్పుడు మారుమోగుతోంది.

అయితే ఇటీవల కాలంలో ఒక్క మెగా కాంపౌండ్ నుంచే ఉన్న హీరోస్ కి అరుదైన గౌరవాలు దక్కాయి. మరి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి మొదటి సరిగా నేషనల్ అవార్డు రావడంతో మెగా ఫ్యామిలీ మొదట ఒక గ్రాండ్ అచీవ్మెంట్ అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ పురస్కారం అందుకోవడం మరో బిగ్ థింగ్ గా మారింది. అయితే ఇవన్నీ మెగాస్టార్ మనవరాలు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల ల కూతురు బేబీ క్లింకారా పుట్టిన తర్వాతే జరగడం విశేషం.

దీనితో మెగా కుటుంబంలో నెలకొన్న ఈ అదృష్టం అంతా కూడా ఆమె వల్లే అని మెగా అభిమానులు భావిస్తున్నారు. అలాగే ఇక ముందు ముందు కూడా మరిన్ని విజయాలు మెగా ఇంట చేరుతాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి అనుకున్నట్టుగానే ముందు కూడా కొనసాగుతుందేమో. జస్ట్ రీసెంట్ గానే రామ్ చరణ్ పేరు పాన్ ఇండియా వైడ్ ఎలా వైరల్ అయ్యిందో కూడా చూసాం.