భర్తను పక్కన పెట్టీ.. అక్కకి ముద్దులు ఇస్తున్న మెగా డాటర్?

మెగా డాటర్ కొనిదెల నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెగా కుటుంబంలో ఉన్న రూల్స్ ని బ్రేక్ చేస్తూ నిహారిక ధైర్యంగా ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగు పెట్టింది. మొదట బుల్లితెర మీద పోస్ట్ గా సందడి చేసిన నిహారిక ఆ సమయంలోనే బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అంతేకాకుండా నాగబాబుతో కలిసి పలు టీవీ షోస్ లో కూడా నీహారిక పాల్గొంది. ఇలా మెగా డాటర్ గా గుర్తింపు పొందిన నిహారిక హీరోయిన్ గా మాత్రం సక్సెస్ కాలేక పోయింది. నిహారిక హీరోయిన్ గా నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అందుకోలేకపోయాయి.

అప్పటినుండి నిహారిక సినిమాలకి దూరంగా ఉంటోంది. పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్న నిహారిక తన భర్త చైతన్య తో కలిసి ఎంతో సంతోషంగా జీవిస్తోంది. గతంలో వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారు అని వార్తలు వినిపించాయి. కానీ ఆ వార్తలలో నిజం లేదని వీరిద్దరి ఫారిన్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ నిరూపించారు. అయితే సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే నిహారిక గతంలో పబ్ లో పట్టుబడటం వల్ల కొంతకాలం సోషల్ మీడియాలో కనిపించలేదు. అయితే ఆ సమస్య నుండి బయటపడి నీహారిక మళ్లీ సోషల్ మీడియాలో రీ ఎంట్రీ ఇచ్చింది.

నిహారిక సిల్వర్ స్క్రీన్ మీద కనిపించకపోయినా డిజిటల్ స్క్రీన్ మీద మాత్రం చాలా సందడి చేస్తోంది. ఇప్పటికే కొన్ని వెబ్ సిరిస్ లలో నటించిన నిహారిక తన భర్త సహకారం తో వాటికి నిర్మాత గా కూడా మారింది. ప్రస్తుతం నీహారిక వెబ్ సిరీస్ లలో నటిస్తూ వాటిని నిర్మిస్తూ బిజిగా ఉంది. అయితే ఇటీవల షాప్ ఓపెనింగ్ సెరోమని లో సుష్మిత, శ్రీజ, నిహారిక ముగ్గురు మెగా డాటర్ లు సందడి చేశారు. ఆతర్వాత పార్టీ లు, డిన్నర్ లు అంటూ ఈ మధ్య ఈ ముగ్గురు కలసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఇటీవల డిజైనర్ శిల్పా రెడ్డీ ఆర్గానిక్ ఐటమ్స్ తో ఒక స్టోర్ స్టార్ట్ చేసింది. ఆ స్టోర్ ఓపెనింగ్ సెర్మోని కి ఈ ముగ్గురు అక్క చెల్లెలతో పాటు నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్య కూడా హాజరయ్యారు.

ఇది ఇలా ఉండగా తాజాగా నిహారికకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో నిహారిక తన భర్త చైతన్య ఒడి లో పడుకొని ఉంది. అయితే నీహారిక తన భర్త ఒడిలో పడుకున్న సమయంలో నిహారిక సోదరి సుష్మిత వీడియో తీసింది. అయితే ఈ వీడియోలో నిహారిక తన భర్త ఒడిలో పనుకొని కెమెరా వైపు చూస్తూ ముద్దులు పెడుతూ అక్క నా ముద్దులు అన్ని నీకే అని అంటుంది. దీన్ని బట్టి చూస్తే వీరిద్దరి మధ్య బాండింగ్ చాలా బాగుందని అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ అక్క చెల్లెలు ఇద్దరు ఒకటే ఫీల్డ్ లో వెళ్తూ వెబ్ సిరీస్ లు నిర్మిస్తూ బిజీగా ఉన్నారు.