Ram Charan-Upasana: టాలీవుడ్ స్టార్ కపుల్ రామ్ చరణ్, ఉపాసన గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తాజాగా ఈ సెలెబ్రిటీ దంపతులు విహారయాత్రకు వెళ్లడం హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రెండేళ్లలో చరణ్, ఉపాసన వెకేషన్‌కు వెళ్లడం ఇదే తొలిసారి అని ఇటీవలే ఉపాసన తన ఇన్‌స్టా పేజీలో పోస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ప్రైవేట్ జెట్‌లో ప్రయాణిస్తున్న తమ ఫొటోను షేర్ చేస్తూ, 2 సంవత్సరాల తర్వాత వెకేషన్ మోడ్‌లో అనే వాక్యాన్ని జత చేయడమే కాకుండా ధన్యవాదాలు మిస్టర్ సి అంటూ రామ్ చరణ్‌ని ట్యాగ్ చేశారు.
ఇకపోతే ఏ మాత్రం గ్యాప్ దొరికినా తన సతీమణితో కలిసి ఫ్యామిలీ టైమింగ్ ఎంజాయ్ చేసే రామ్ చరణ్ తేజ్ మరొకసారి తన భార్య ఉపాసనతో కలిసి ఆనందంగా గడుపుతున్నట్టు తెలుస్తోంది. అయితే మొన్నటి వరకూ సినిమాలు, షూటింగ్‌లు అంటూ బిజీ బిజీగా గడిపిన రామ్ చరణ్ ఇప్పుడు తన వైఫ్‌తో చేరి చిన్న పిల్లాడిలా ఆటలాడుతున్నారు. అవును.. నిజమే వారిద్దరూ కలిసి ఇటీవల వెకేషన్ కోసం ఫిన్లాండ్ వెళ్లిన ఈ లవ్‌లీ కపుల్ ఇద్దరూ కలిసి ట్రాలీపై ఆటలాడుతూ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. మంచులో ఇద్దరూ సరదాగా గడుపుతూ తమ వాల్యూబుల్ టైంను స్పెండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఉపాసనతో పాటు చెర్రీ కూడా చిన్నపిల్లాడిగా మారిపోయి అల్లరి చేశారు. చాలా కాలం తర్వాత ఈ కపుల్ ఇలా ఎంజాయ్ చేయడం చూస్తున్న అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ కనిపించనుండగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ క్యారెక్టర్‌లో సందడి చేయనున్నారు. భారీ అంచనాల మధ్య రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుండడంతో త్వరలోనే చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ను వేగంవంతం చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం రామ్ చరణ్ డైరక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ చిత్రంలో చేస్తున్నట్టు సమాచారం.
