పవన్ “ఓజి” కి యూఎస్ రిలీజ్ పై మాసివ్ అప్డేట్.!

టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో తన కెరీర్ బిగ్గెస్ట్ ఏక్షన్ డ్రామా చిర్రమ్ “ఓజి”. మరి ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అంటూ యువ దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ఇది.

కాగా ఈ చిత్రం నుంచి అయితే నిన్ననే భారీ అప్డేట్ ని ఈ సెప్టెంబరు 2న రాబోతున్నట్టుగా కన్ఫర్మ్ చేయగా ఇక ఇప్పుడు మరో మాసివ్ అప్డేట్ ఓజి రీజన్ నుంచి అయితే సినీ వర్గాల్లో బయటకి వచ్చింది. కాగా ఈ చిత్రాన్ని అయితే యూఎస్ కి సంబంధించి ప్రముఖ సక్సెస్ ఫుల్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ అయినటువంటి ప్రత్యంగిరా వారు రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

అయితే ఇదే సంస్థ నుంచి సలార్, భోళా శంకర్, దసరా ఇంకా రానున్న రోజుల్లో మరిన్ని భారీ చిత్రాలు రిలీజ్ చేసే సంస్థ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. కాగా ఈ మాసివ్ చిత్రం వీరితో పాటుగా ఏఏ క్రియేషన్స్ వారు అయితే కలిపి రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. దీనితో యూఎస్ లో సెన్సేషనల్ రిలీజ్ ఓజి చిత్రానికి దక్కుతుంది అని చెప్పాలి.

కాగా లేటెస్ట్ రిపోర్ట్స్ తో అయితే ఈ చిత్రం రిలీజ్ ఈ ఏడాదిలోనే ఉంటుంది అని టాక్ ఉంది. ఇంకా ఈ చిత్రంలో అర్జున్ దాస్ అలాగే శ్రీయ రెడ్డి తదితర స్టార్ కాస్ట్ నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే RRR నిర్మాణం సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.