ఇప్పుడు టాలీవుడ్ సినిమా దగ్గర ఉన్నటువంటి కొన్ని క్రేజీ అండ్ అవైటెడ్ కాంబినేషన్స్ లో క్లాసిక్ చిత్రాలు అతడు, ఖలేజా లాంటి చిత్రాలను అందించిన సెన్సేషనల్ కాంబినేషన్ సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ కూడా ఒకటి.
మరి ఈ కాంబినేషన్ నుంచి హ్యాట్రిక్ సినిమా ఇప్పుడు తెరకెక్కుతూ ఉండడంతో దీనిపై భారీ హైప్ సెట్ అయ్యింది. అయితే ఇదిలా ఉండగా ఈ చిత్రం కోసం అంతా ఎదురు చూస్తుండగా ముందుగా అయితే సినిమా ఫస్ట్ సాంగ్ కోసం చూస్తున్నారు. మరి ఈ సినిమాకి సంగీతం థమన్ అందిస్తుండగా ఈ ఆల్బమ్ నుంచి ఫస్ట్ సింగిల్ ఇది వరకే రిలీజ్ కావాల్సి ఉంది.
కానీ ఫైనల్ మూమెంట్ లో ఆగిపోయింది. అయితే మొదటి సాంగ్ గా ఓ మెలోడీ నెంబర్ ని రిలీజ్ చేద్దామా లేక మాస్ సాంగ్ ని దింపుదామా అనే డైలమాలో అయితే ఇప్పుడు సాధ్యం అయ్యే విషయంలో మహేష్ ఫ్యాన్స్ కి కావాల్సిన మాస్ సాంగ్ నే వచ్చేలా ఉందని సినీ వర్గాలు చెప్తుంన్నాయి.
మెలోడీ సాంగ్ కి అయితే హీరో హీరోయిన్ పై సాంగ్ షూట్ చేయాల్సి ఉంది. కానీ మాస్ అండ్ సోలో సాంగ్ అయితే సినిమా నుంచే మహేష్ పై వర్కింగ్ స్టిల్స్ అయినా పెట్టి మ్యానేజ్ చేయవచ్చు అనే ప్లానింగ్ లో ఉన్నారట. మరి ఏదైనా సరే త్వరలోనే ఫస్ట్ సాంగ్ ఉంటుంది అని గట్టి రూమర్స్ వినిపిస్తున్నాయి.