Ravi Teja: ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ రామారావు ఆన్ డ్యూటీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నారు. రామారావు ఆన్ డ్యూటీ సినిమా తర్వాత `థడాకా` సినిమా లైన్ లో ఉంది. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత రవితేజ నటిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా `టైగర్ నాగేశ్వరరావు`.ఇటీవలే ఖిలాడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్ రాజా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాడు. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు.
టైగర్ నాగేశ్వరరావు సినిమాకు వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. టైగర్ నాగేశ్వర్ రావు సినిమా గజదొంగ బయోపిక్ సంబంధించినది. స్టువర్ట్ పురం దొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ఈ సినిమా.ఓ దొంగ బయోపిక్ తీయడం నిజంగా అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.పాన్ ఇండియా చిత్రం `ది కాశ్మీర్ ఫైల్స్`తో బాలీవుడ్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నిర్మాత అభిషేక్ అగర్వాల్ కి ఇది డ్రీమ్ ప్రాజెక్ట్.అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా, తేజ్ నారాయణ్ అగర్వాల్ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. రవితేజ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రమిది.
ఉగాది రోజున (ఏప్రిల్ 2న) మాదాపూర్ లోని నోవాటెల్లో (హెచ్ఐసిసిలో) టైగర్ నాగేశ్వరరావు చిత్ర ప్రధాన బృందం సమక్షంలో గ్రాండ్ లాంఛింగ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఉగాది నాడు మధ్యాహ్నం 12:06 గంటలకు సినిమా ప్రీ లుక్ ని విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ పోస్టర్ ద్వారా తెలియజేసింది. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో రిలీజ్ కానుంది. మొన్నామధ్య రిలీజ్ అయిన ఈ సినిమా టైటిల్ పోస్టర్ భారీ రెస్పాన్స్ సంపాదించి ఒక్కసారిగా క్యూరియాసిటీని పెంచింది. హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్లతో నిండిన ఈ సినిమాపై ఇప్పటికే క్రేజ్ ఏర్పడింది. 1970 నాటి కథ కావడంతో ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ తన సంగీతంతో అలరించనున్నారు.