ప్రస్తుతం రీజనల్ గా టాలీవుడ్ దగ్గర రానున్న స్టార్ హీరోల చిత్రాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా యంగ్ హీరోయిన్ శ్రీ లీల మరియు పూజా హెగ్డే లు నటిస్తున్న చిత్రం కూడా ఒకటి. కాగా ఈ చిత్రాన్ని అయితే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించగా భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి.
కానీ మరో సినిమా సినిమా షూటింగ్ అలా ఆలస్యం అవుతూ రావడం పైగా తర్వాత షూట్ చేసిన ఫుటేజ్ కూడా పక్కన పెట్టేస్తూ ఉండడం వంటిది ఫ్యాన్స్ లో మరింత నీరసం తెప్పిస్తుంది. అయితే ఓ భారీ యాక్షన్ సినిమాగా మొదట దీనిని ప్లాన్ చేయగా తర్వాత ఇది కాస్త ఊరు డ్రామాగా మారిపోయింది.
మహేష్ బాబు ని మాస్ గా ప్రెజెంట్ చేస్తున్నారు అనే మాట తప్ప ఇంకో అంశంలో ఈ సినిమాపై అంచనాలు లేవు. ఇక టైటిల్స్ విషయంలో కూడా ఫ్యాన్స్ అంత ఎగ్జైట్ అయిపోయేలా అయితే లేదు. ఇక ఎట్టకేలకు అయితే ఓ టైటిల్ ఆల్ మోస్ట్ ఫిక్స్ అయ్యేలా ఉందని టాక్ వచ్చింది.
అదే “అమరావతికి అటు ఇటు”. ఇది మరీ క్లాస్ గా ఉంది కానీ లేటెస్ట్ గా అయితే రెండో టైటిల్ ని తీసుకొచ్చారు. అదే “గుంటూరు కారం” అట. ఇది ఆ అమరావతికి టైటిల్ కన్నా చాలా బెటర్ గా ఉంది కానీ సెంటిమెంట్ ని నమ్ముకొని వెళ్తే మాత్రం ఆ అమరావతి టైటిల్ నే లాస్ట్ కి పెడతారని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు అయితే ఇలా ఈ రెండు మాస్ అండ్ క్లాస్ టైటిల్స్ ని లాస్ట్ స్టేజి లో పెట్టుకొని ఒకదాన్ని ఈ మే 31 న గాని 30 న గాని అనౌన్స్ చేస్తారని ఇండస్ట్రీ టాక్.