క‌ళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక‌లో బెస్ట్ డెబ్యూ యాక్ట‌ర్ అవార్డును గెలుచుకున్న తిరువీర్‌

కెరీర్ ప్రారంభం నుంచి విల‌క్ష‌ణ పాత్ర‌లు, వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ న‌టుడిగా త‌న‌దైన గుర్తింపును సంపాదించుకున్న తిరువీర్‌. మ‌సూద‌, ప‌రేషాన్ వంటి చిత్రాల‌తో వెర్స‌టైల్ యాక్ట‌ర్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు.

మ‌సూద సినిమాలో తిరువీర్ న‌ట‌న‌కు మంచి ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఇప్పుడు తిరువీర్ ప్రెస్టీజియ‌స్ అవార్డును ద‌క్కించుకున్నారు. హైద‌రాబాద్‌లో జరిగిన క‌ళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక ఘ‌నంగా జ‌రిగింది. లెజెండ్రీ యాక్ట‌ర్, ప‌ద్మ‌శ్రీ అవార్డ్ గ్ర‌హీత డా.నంద‌మూరి తార‌క రామారావు పేరు మీద సినిమాల్లో వివిధ కేట‌గిరీల‌కు అవార్డుల‌ను అంద‌జేశారు. వీటిలో మ‌సూద చిత్రంలో అద్భుత‌మైన న‌ట‌న‌కుగానూ తిరువీర్ బెస్ట్ డెబ్యూ యాక్ట‌ర్ అవార్డును సొంతం చేసుకున్నారు. ఇది ఆయ‌న కెరీర్‌లో మ‌ర‌చిపోలేని మైల్‌స్టోన్‌.

మ‌సూద సినిమా హార‌ర్ థ్రిల్ల‌ర్‌. తిరువీర్‌తో పాటు సంగీత‌, కావ్య క‌ళ్యాణ్ రామ్‌, శుభ‌లేక సుధాక‌ర్, సుర‌భి ప్ర‌భావ‌తి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. సాయి కిర‌ణ్.వై ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు. స్వ‌ధ‌ర్మ ఎంట‌ర్‌టైన్మెంట్ ప్రై.లి బ్యాన‌ర్‌పై రాహుల్ యాద‌వ్ న‌క్కా ఈ చిత్రాన్ని నిర్మించారు.