HomeNewsఆర్.ఆర్.ఆర్ నుంచి మార్చ్ 15 న వచ్చే భారీ సర్‌ప్రైజ్ తో బాలీవుడ్ లో అంచనాలు...

ఆర్.ఆర్.ఆర్ నుంచి మార్చ్ 15 న వచ్చే భారీ సర్‌ప్రైజ్ తో బాలీవుడ్ లో అంచనాలు పెంచబోతున్న రాజమౌళి ..?

ఆర్.ఆర్.ఆర్ నుంచి మార్చ్ 15 న భారీ సర్‌ప్రైజ్ చేశాడట దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి. ఆ రోజుకి ఒక ప్రత్యేకత ఉండటం వల్ల రాజమౌళి ఇలా ప్లాన్ చేశాడని అంటున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ మల్టీస్టారర్ గా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో క్లైమాక్స్ సీన్స్ తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా తమిళ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ భారీ మొత్తానికి దక్కించుకున్న సంగతి తెలిసిందే.

Whatsapp Image 2021 02 25 At 12.34.03 Pm | Telugu Rajyam

ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్.. రామరాజు ఫర్ భీం, భీం ఫర్ రామరాజు టీజర్స్ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో చూపించాడు రాజమౌళి. దాంతో ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమా నుంచి మళ్ళీ సర్‌ప్రైజ్ ఎప్పుడు వస్తుందో అని అందరూ ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో మార్చ్ 11 న మహా శివరాత్రి పండుగ సందర్భంగా ఆర్ ఆర్ ఆర్ నుంచి ఏదైనా సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారని అందరూ అనుకుంటున్నారు. కాని ఆ సర్‌ప్రైజ్ మార్చ్ 15 న రాజమౌళి ప్లాన్ చేసినట్టు తాజా సమాచారం. అంతేకాదు ఆర్ ఆర్ ఆర్ సినిమా మీద బాలీవుడ్ లో బజ్ క్రియేట్ చేయడానికి కూడా ఇదే మంచి అవకాశం అని భావిస్తున్నారట.

మార్చ్ 15 న హీరోయిన్ ఆలియా భట్ బర్త్ డే. ఆ స్పెషల్ డే కి ఆర్ ఆర్ ఆర్ లో ఆలియా భట్ పోషిస్తున్న సీత పాత్ర ని రివీల్ చేస్తూ స్పెషల్ టీజర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ టీజర్ తో బాలీవుడ్ లో ఆర్ ఆర్ ఆర్ మీద భారీగా అంచనాలు పెంచవచ్చన్న ది కూడా మేకర్స్ ఆలోచన అని తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమన్నది తెలీదు గాని ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇప్పటికే ఆలియా భట్ మీద.. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఉన్న కీలకమైన సీన్స్ తో పాటు సాంగ్స్ కూడా చిత్రీకరించారని సమాచారం. కాబట్టి ఖచ్చితంగా ఆర్ ఆర్ ఆర్ నుంచి ఆలియా భట్ కి సంబంధించిన మోషన్ పోస్టర్ గాని టీజర్ గాని వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు.

Related Posts

Gallery

Most Popular

Polls

Latest News