Manoj: మంచు మోహన్ బాబు కుటుంబంలో జరుగుతున్న వివాదాలు ఇప్పుడే సర్దుమనిగేలా లేవని స్పష్టంగా తెలుస్తోంది. ఇలా గత మూడు రోజులుగా ఈ కుటుంబంలో తీవ్రస్థాయిలో గొడవలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో తాజాగా మంచు మనోజ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఎంతో ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ముందుగా మీడియా వారికి ఈయన క్షమాపణలు చెప్పారు.
నాకు మద్దతుగా నిలబడటం కోసం వచ్చిన మీ అందరి పట్ల నాన్న అలా ప్రవర్తించినందుకు అందరికీ క్షమాపణలు తెలియజేశారు. మా నాన్న నాకు దేవుడితో సమానం నాన్న అంటే నాకు చాలా ప్రేమ కానీ విష్ణు వినయ్ ఇద్దరు కలిసి నాన్నను డైవర్ట్ చేశారని నాన్న దృష్టిలో నన్ను చెడ్డవాడిగా చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు.
నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని నా భార్య పిల్లలతో సంతోషంగా ఉన్నాను అది తప్ప అంటూ ఈయన ప్రశ్నించారు నా విషయంలో నాన్న దగ్గర చెడుగా చెప్పి నన్ను చెడ్డవాన్ని చేశారు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా గొడ్డులా కష్టపడ్డాను నేను. నాకు సపోర్ట్ గా నిలిచిన అమ్మని కూడా మూడు రోజుల నుంచి ఇంట్లో లేకుండా బయటకు పంపించేశారు. మనోజ్ కు మేము సర్ది చెబుతాము నువ్వేం టెన్షన్ పడకు అంటూ అమ్మను కూడా ఇక్కడ లేకుండా పంపించేసారని తెలిపారు.
ఇక నా భార్య ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో ఆమెను చాలా ఇబ్బందులకు గురి చేశారని మనోజ్ ఎమోషనల్ అయ్యారు. నా భార్య పిల్లలను ప్రతి విషయంలోకి లాగుతున్నారని నేను వారి కోసం ఇప్పుడు పోరాటం చేయకపోతే జీవితంలో వారి ముందు తల ఎత్తుకోలేనని తెలిపారు. తాను వారి నుంచి ఏమీ ఆశించలేదు నా సొంత కాళ్లపై నేను నిలబడాలని ప్రయత్నం చేసిన అడ్డుపడుతున్నారు తన భార్యతో కలిసి ఒక టాయ్ కంపెనీ ఏర్పాటు చేయబోతూ ఉండగా దానికి కూడా అడ్డుకున్నారని మనోజ్ తెలిపారు.
మౌనికకు తన తల్లిదండ్రులు లేరు వారే కనుక ఉంటే ఇలా చేయగలరా అంటూ ప్రశ్నించారు. గతంలో తాను కమిట్ అయిన అహం బ్రహ్మాస్మి సినిమాకు కూడా అడ్డుపడ్డారని మనోజ్ తెలిపారు.ఇలా మీడియా సమావేశంలో ఈయన ఎన్నో ఆసక్తికరమైన సంచలన విషయాలను బయటపెట్టారు అదేవిధంగా ఈరోజు సాయంత్రం తాను ప్రెస్ మీట్ నిర్వహించి పూర్తి వివరాలన్నింటిని కూడా వెల్లడిస్తాను అంటూ మనోజ్ ఈ సందర్భంగా మీడియా ఎదుట చేసిన ఈ కామెంట్స్ సంచలనగా మారాయి.