Manoj: నా కుమారుడు మనోజ్ చెప్పిన దాంట్లో నిజం లేదు… కొడుకుకి షాక్ ఇచ్చిన మనోజ్ తల్లి?

Manoj: మంచు మనోజ్ కు తన తల్లి నిర్మల గట్టి షాక్ ఇచ్చారు. ఇటీవల తన కుటుంబంలో వరుసగా వివాదాలు చోటుచేసుకుంటున్న తరుణంలో మంచు మనోజ్ సోషల్ మీడియాలోనూ అలాగే మీడియా ముందు ఎంతో ఎమోషనల్ అవుతూ తన కుటుంబ సభ్యులు తనని ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు అదే విధంగా తన తల్లి పుట్టిన రోజు సందర్భంగా కేక్ ఇచ్చే నెపంతో విష్ణు అలాగే ఆయన అనుచరులు ఇంట్లోకి వచ్చి నానాహంగామా చేశారని తన జనరేటర్ లో చక్కెర పోసి విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు కలిగించి భయభ్రాంతులకు గురి చేశారు అంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

ఇలా మంచు విష్ణు నుంచి నాకు ప్రమాదం ఉందని ఈయన పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు అయితే ఈ ఫిర్యాదు పై ఇటీవల మనోజ్ తల్లి నిర్మల పోలీసులకు రాసిన లేఖ ప్రస్తుతం వైరల్ అవుతుంది. అయితే మంచు విష్ణు తన ఇంట్లోకి వచ్చి గొడవ చేశారని జనరేటర్ లో చెక్కర పోసారంటూ మనోజ్ చేస్తున్న ఆరోపణలలో నిజం లేదని ఈమె పోలీసులకు లేఖ రాశారు. దీంతో ఒక్కసారిగా ఈ వార్త వైరల్ అవుతుంది.

మనోజ్ ఆరోపణలు చేసినట్లు విష్ణు ఆరోజు తన మనుషులతో ఇంటికి రాలేదు ఈ ఇంటిపై మనోజ్ కు ఎంత హక్కు ఉందో విష్ణుకి కూడా అంతే హక్కు ఉంది. నా పుట్టిన రోజు సందర్భంగా విష్ణు నాకోసం కేక్ తెచ్చి నా చేత కట్ చేయించారు అనంతరం నాతో కొంత సమయం గడిపి తిరిగి తన గదిలో ఉన్నటువంటి వస్తువులను కొన్ని తీసుకొని వెళ్ళిపోయారు.

విష్ణు నా పుట్టినరోజు నాడు మనుషులతో ఇంట్లోకి రాలేదు. మనోజ్‌ ఫిర్యాదులో నిజం లేదు. ఈ ఇంట్లో పనిచేస్తున్న వాళ్లు కూడా మేమిక్కడ పనిచేయలేమని.. వాళ్లే మానేశారు. ఇందులో విష్ణు ప్రమేయం లేదనీ ఆ లేఖలో నిర్మల పేర్కొన్నారు దీన్ని బట్టి చూస్తుంటే మనోజ్ మాటలలో తప్పు ఉందని కొందరు కామెంట్లు చేయగా మరి కొందరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మూడు రోజులకు నిర్మల స్పందించడంతో విష్ణు, మోహన్ బాబు బెదిరింపులతోనే ఈమె ఇలాంటి బహిరంగ లేఖ రాశారా అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.