తన తండ్రి దేవుడు అంటున్న మనోజ్.. వైరల్ అవుతున్న పాత వీడియో!

ఇప్పుడు మంచు వారి ఇంటి గొడవలు రచ్చకెక్కాయి, కొడుకు మనోజ్ తనపై దాడి చేశాడని మోహన్ బాబు, తండ్రి తనపై చేయి చేసుకున్నాడని మంచు మనోజ్ ఇద్దరూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మంగళవారం రాత్రి మంచు మనోజ్ మోహన్ బాబు ఇంటి ముందు చేసిన హడావిడి అందరికీ తెలిసిందే. ఆ సమయంలో మీడియా పై మోహన్ బాబు చేసిన దాడి, గాయపడిన ఆ రిపోర్టర్.. తర్వాత ఈ వివాదంపై మంచు విష్ణు, మంచు మనోజ్ వేరువేరుగా మీడియా సమావేశాలు నిర్వహించి వారి వారి వెర్షన్స్ లో వారి స్టోరీలు చెప్పుకొచ్చారు.

ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు సోషల్ మీడియా ఫోకస్ అంతా మంచు ఫ్యామిలీ పైనే ఉంది. మంచి ఫ్యామిలీలో పాత విషయాలపై కూడా ఇప్పుడు మీడియా ఫోకస్ చేసింది. ఆ సందర్భంగా మంచు మనోజ్ తన తండ్రి మీద ఎంత ప్రేమ చూపించేవాడో తెలిపే వీడియో ఒకటి మళ్ళీ వైరల్ అవుతుంది. మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా యానిమల్ సినిమాలో నాన్న.. నువ్వు నా ప్రాణం అంటూ సాగే పాటపై మనోజ్ ఈ వీడియోను రూపొందించడం జరిగింది.

ఈ వీడియోలో తాను చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు కలిసిన నటించిన చిత్రాల ఫుటేజ్ ని పొందుపరిచారు. అంతేకాకుండా జీవితంలో నువ్వు నేర్పించిన పాఠాలకి.. నా జీవితానికి ధన్యవాదాలు.. పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న అంటూ ఆ వీడియోకి ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజానికి మనోజ్ కి తన తండ్రి మోహన్ బాబు అంటే ఎంత ఇష్టమో అనేది మనందరికీ కూడా తెలిసిందే.

మొన్న ఇంత గొడవ జరిగిన తర్వాత కూడా మనోజ్ మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి దేవుడు అని, ప్రేమించిన అమ్మాయి కోసం పోరాటం చేసే క్రమంలో తన తండ్రికి తనకు మధ్య విభేదాలు రావటం వల్లనే ఇలా జరిగిందని, తన తండ్రి ఒకప్పుడు ఇలా ఉండేవాడు కాదు అని చెప్పాడు మనోజ్. ఏది ఏమైనాప్పటికీ ఆ తండ్రి బిడ్డలు మళ్ళీ కలవాలని కోరుకుంటున్నారు మంచు ఫ్యామిలీ ఫాన్స్.