తెలుగు చిత్ర పరిశ్రమలో మంచు మోహన్ బాబు సినీ ప్రస్థానం గురించి మనకు తెలిసిందే. ఈయన విలక్షణ నటుడిగా మాత్రమే కాకుండా హీరోగా నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు.ఇకపోతే మంచు మోహన్ బాబు వారసుడిగా ఆయన పెద్ద కుమారుడు విష్ణు ఇండస్ట్రీలోకి విష్ణు సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు. విష్ణు బాల నటుడిగా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ హీరోగా మాత్రం ఆయన మొదటి చిత్రం విష్ణు అని చెప్పాలి.ఇక తన కుమారుడిని హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేసే సమయంలో మోహన్ బాబు తన కొడుకు విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు.
నిజానికి ఈ సినిమాని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో ఈ సినిమా చేయాల్సి ఉంది.కొన్ని కారణాల వల్ల రాఘవేంద్రరావు ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఈ సినిమాలో మలయాళం దర్శకుడు షాజీ కైలాస్ ను విష్ణు మొదటి సినిమాకి ఎంపిక చేసుకున్నారు. హీరోయిన్ గా సాక్షి శివానంద్ చెల్లెలు అయిన శిల్పా ఆనంద్ ను తీసుకున్నారు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలకు సంగీతం అందించిన బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇస్మాయిల్ దర్బార్ ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు.పరుచూరి బ్రదర్స్ రైటర్స్ గా ఎంపిక చేసుకున్నారు.
ఇలా విష్ణు డెబ్యు మూవీ కోసం మోహన్ బాబు స్టార్ సెలబ్రిటీలను రంగంలోకి దింపారు. ఇలా భారీ క్యాస్టింగ్ తోమోహన్ బాబు ఎన్నో జాగ్రత్తలు తీసుకొని 2003 వ సంవత్సరంలో ఈ సినిమాను విడుదల చేశారు అయితే ఈ సినిమా విష్ణుకి పెద్దగా గుర్తింపు తీసుకురాలేకపోయింది. ఇకపోతే ఈ సినిమా కోసం అప్పట్లో మోహన్ బాబు పెట్టిన ఖర్చు తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరు ఆశ్చర్య పోవాల్సిందే. ఈ సినిమా కోసం అప్పట్లోనే మోహన్ బాబు 28 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు.అప్పట్లో 28 కోట్లు అంటే ప్రస్తుతం వందల కోట్లు తో సమానం.ఇలా భారీ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.