Manchu Vishnu: మరో వివాదంలో మంచు విష్ణు… అడవి పందులను బంధించిన సిబ్బంది?

Manchu Vishnu: గత కొంతకాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి కుటుంబం పెద్ద ఎత్తున వివాదంలో చిక్కుకున్నారు. మంచు కుటుంబంలో ఆస్తి గొడవలు చోటు చేసుకున్న నేపథ్యంలో మంచు మోహన్ బాబు విష్ణు మనోజ్ పై పెద్ద ఎత్తున దాడి చేయడమే కాకుండా ఒకరిపై మరొకరు పోలీసుల కేసులు కూడా పెట్టుకున్నారు. ఇలా ఈ గొడవల నేపథ్యంలో మంచు కుటుంబ సభ్యులందరూ కూడా రోడ్డుపైకి వచ్చి గొడవ పడిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే మంచు మోహన్ బాబు మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా మైక్ తీసుకొని రిపోర్టర్ పై దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయాలు పాలు అయ్యారు. ఈ విషయంపై మోహన్ బాబుపై కేసు పెట్టగా ఏ క్షణమైన ఆయన అరెస్ట్ కావచ్చని తెలుస్తుంది .అయితే ప్రస్తుతం తనపై కేసు నమోదు కావడంతో మోహన్ బాబు పరారీలో ఉన్నారని తెలుస్తుంది.

ఇలా ఈ కుటుంబంలో చోటు చేసుకున్న ఈ ఆస్తి వివాదం పూర్తిగా సర్దుమనగక ముందే మరోసారి మంచు విష్ణు వివాదంలో నిలిచారు. ముఖ్యంగా ఆయన సిబ్బంది జెల్ పల్లి అటవీ ప్రాంతంలో వేటకు వెళ్లి అడవి పందులను బంధిస్తూ తీసుకు వస్తున్నటువంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది దీంతో మరోసారి విష్ణు వివాదంలో నిలిచారు.

విష్ణు మేనేజర్ కిరణ్ చిట్ట అడవి పందులను వేటాడాడు. వేటాడిన అడవి పందిని ఎలక్ట్రీషియన్ దేవేంద్ర ప్రసాద్ బంధించి తీసుకొచ్చాడు. అడవి పందిని వేటాడి తీసుకెళ్లినట్టు మేనేజర్ కిరణ్, ఎలక్ట్రీషియన్ ప్రసాద్ పై ఇప్పటికే పలు ఆరోపణలు వచ్చాయని గతంలో మనోజ్ వెల్లడించారు ఇప్పటికీ వీరిద్దరూ తమ వ్యవహార శైలిని మార్చుకోలేదని వెల్లడించారు. తాజాగా వీరిద్దరూ ఇలా అడవి పందిని బంధించి తీసుకెళ్లడంతో మరోసారి విష్ణు వివాదంలో చిక్కుకున్నారు. ఇది చూసిన అభిమానులు విష్ణు పై చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.