ఆర్థిక అవకతవకలకు ఆధారాలు ఉన్నాయి.. తండ్రి, అన్నల నిజ స్వరూపం బయటపెట్టిన మంచు మనోజ్!

మంచు ఫ్యామిలీలో గొడవలు తారా స్థాయికి చేరి ఆఖరికి పోలీసు స్టేషన్ వరకు వెళ్లాయి. తనపై దాడి చేశారంటూ మనోజ్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరి కొంత సమయానికే మోహన్ బాబు తన కొడుకు పై పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాచకొండ సి పి కి లేఖ కూడా రాశారు. మనోజ్ తో పాటు కోడలు మౌనిక నుంచి కూడా తనకు ముప్పు పొంచి ఉందని రక్షణ కల్పించాలని లేఖలో పేర్కొన్నారు.

అయితే ఈ విషయంపై మనోజ్ స్పందిస్తూ తాను తన భార్య మౌనిక సొంత కాళ్ళపై నిలబడి సంపాదించుకుంటున్నామని, తన సోదరుడు కొన్ని కారణాల రిత్యా దుబాయ్ కి వెళ్లడంతో అమ్మ ఇంట్లో ఒంటరిగా ఉంటుందని చెప్పాడు. నాన్న, ఆయన స్నేహితుల కోరిక మేరకు తాను గత సంవత్సరం నుంచి కుటుంబానికి చెందిన ఇంట్లో ఉంటున్నానని అయితే తప్పుడు ఉద్దేశంతో తాను నాలుగు నెలల క్రితం ఆ ఇంట్లోకి వచ్చానని తండ్రి చేసిన ఫిర్యాదులో నిజం లేదని చెప్పారు. ఈ వివాదంలోకి తన ఏడు నెలల కూతురిని కూడా లాగటం బాధాకరమని ఇలాంటి విషయాల్లోకి తన పిల్లలని లాగవద్దని మనోజ్ కోరుకున్నారు.

తన సోదరుడు విష్ణు, ఆయన అసోసియేట్ వినయ్ మహేశ్వరి మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థులను, స్థానిక వ్యాపారులను దోపిడీ చేస్తున్నారు. వారికి మద్దతుగా బహిరంగంగా మాట్లాడినందుకే ఈ ఫిర్యాదు చేశారని మనోజ్ తెలిపారు. ఆర్థిక అవకతవకులకు ఆధారాలు తన వద్ద ఉన్నాయని కావాలంటే వాటిని అధికారులు సమర్పిస్తానని ఆయన పేర్కొన్నారు.

విష్ణు కుటుంబ వనరులను దుర్వినియోగం చేశాడని అయినా తన తండ్రి ఎప్పుడూ అతనికి మద్దతుగా ఉన్నాడని మనోజ్ తెలిపారు. కుటుంబా వివాదాల పరిష్కారం కోసం నిజాయితీగా అందరి ముందు చర్చలు జరపాలని గత సెప్టెంబర్ లో హృదయపూర్వకంగా తండ్రిని వేడుకుంటే అతను పట్టించుకోకపోగా ఇప్పుడు ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ వాపోయాడు మంచు మనోజ్.