బాబూ మనోజ్.! కెరీర్‌ని ఖతం చేసుకున్నదెవరు.?

మంచు మనోజ్ సినిమాల్లో కనిపించి చాలా ఏళ్లయ్యింది. ఇదిగో వస్తున్నా.. అదిగో వస్తున్నా.! అంటూ కొత్త ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తున్నాడు కానీ, అవేమీ కార్య రూపం దాల్చడం లేదు మంచు మనోజ్ వైపు నుంచి.

తాజాగా ఓ వీడియో రిలీజ్ చేశాడు మంచు మనోజ్. ఈ వీడియో‌లోని మంచు మనోజ్ మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయ్.. ‘నా పనైపోయిందంటూ కొందరు ఎగతాళి చేశారు..’ అంటూ ఏవేవో మాట్లాడుతున్నాడు మనోజ్ ఈ వీడియోలో.

నిజానికి మంచు మనోజ్ కెరీర్‌ తన చేతులారా తానే పాడు చేసుకున్నాడు. మంచి టాలెంట్ వున్నోడు. డిఫరెంట్ విజన్ వున్నోడు కూడా. మంచు మనోజ్ సినిమాల్లో ఏదో విషయం వుంటుందన్న ఆసక్తి క్రియేట్ చేసేవాడు తన సినిమాల ద్వారా.

అంతేకాదు, టెక్నికల్‌గానూ మంచి పట్టున్నోడు. డైరెక్షన్ చేయగలడు.. స్టంట్స్ కొరియోగ్రఫీ చేసుకోగలడు.. సొంత నిర్మాణ సంస్థ వుంది. అన్నయ్య మంచు విష్ణు నిర్మాత. అలాగే తండ్రి, సోదరి కూడా నిర్మాతలే. ఆయన కూడా సొంతంగా సినిమాలు నిర్మించుకోగల సత్తా వున్నోడే.

కానీ, కావాలని కెరీర్ ఖతం చేసుకున్నోడు. పబ్లిసిటీ స్టంట్లు కట్టబెట్టి తదుపరి సినిమాల వ్యవహారం వెల్లడిస్తే ఇప్పటికైనా బావుంటుంది.. అంటూ మంచు మనోజ్‌కి ఆయన సన్నిహితులు సలహా ఇస్తున్నారట.

అలాగే, నన్నేదో అనేస్తున్నారు.. అంటూ ఈ తరహా సింపతీ గేమ్స్‌ ప్లే చేయడం వల్ల కూడా ఎలాంటి ప్రయోజనం లేదు మనోజ్ బాబూ.. అంటూ సున్నితంగా హెచ్చరిస్తున్నారట కూడా. మరి ఇప్పటికైనా మంచు వారబ్బాయ్ గుర్తెరిగి మసలుకుంటాడా.! చూడాలిక.